మందగమనంలో మారుతి

MARUTI-
MARUTI

న్యూఢిల్లీ: గత నెలలో వాహనఅమ్మకాలు నిరాశపరచడంతో మారుతిసుజుకి షుర్లు బలహీనపడ్డాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 2.2శాతం క్షీణించి రూ.9317 వద్ద ట్రేడవుతోంది. మొదట రూ.9301 వరకూ క్షీణించింది. జులైలో మొత్తం వాహన విక్రయాలు 0.6శాతం తక్కువగా 1.64 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. దేశీయంగా వాహన అమ్మకాలు నామమాత్రంగా 1శాతం పెరిగి 1.54 లక్షల యూనిట్లను తాకాయి. మొత్తం ఎగుమతులు 10 శాతం క్షీణించి 10,219 యూనిట్లకు చేరాయి. ప్యాసింజర్‌ కార్త అమ్మకాలు నామమాత్ర వృద్ధితో 1.12లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి.