భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

SENSEX-N
SENSEX-N

 

ముంబయి: అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న సూచీలు ఈ ఉదయం జోరుగా ప్రారంభమమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్‌ 300 పాయింట్లకుపైగా లాభంతో ట్రేడ్‌ అయ్యింది. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటం కూడా సూచీలకు కలిసొచ్చింది. ఆర్థిక రంగాల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్లు భారీ లాభాల దిశగా పరుగులు తీశాయి. ఒక దశలో 500 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్‌ చివరకు 453 పాయింట్ల లాభంతో 36,170 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 130 పాయింట్లు ఎగబాకి 10,859 వద్ద స్థిరపడింది.