భారీగా పతనమైన స్టాక్‌మార్కెట్లు

SENSEX DOWN
SENSEX DOWN

ముంబయి: రేపు వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, డాలరుతో పోలిస్తే రూపాయి బలహీనపడడం, అమెరికాచైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, చమురు ధరలు పెరగడం తదితర పరిణామాల నేపథ్యంలో దలాల్‌ స్ట్రీట్‌లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఉదయం నుంచి స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. లోహ, మౌలిక, ఆటోమొబైల్స్‌, ఫార్మా, బ్యాంకింగ్‌తో పాటు దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.