భారత విప‌ణిలో విడుదలైన జపాన్‌కు చెందిన సోనీ సరికొత్త ఫోన్‌

JAPAN sony phone
JAPAN sony phone

న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ సోనీ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌ 1 ను భారత్‌లో
విడుదల చేసింది.కాగా ధర 44.990 రూపాయలు.బ్లాక్‌ కలర్‌ వేరియంట్‌లో లభిస్తున్న ఈ ఫోన్‌ విక్రయాలు సోమవారం నుంచి  ప్రారంభమయ్యాయి. వాస్తవానికి ఆండ్రాయిడ్‌ 7.1.1 నౌగాట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈనెల మొదటి వారంలో ఎక్స్‌పిరియా ఎక్స్‌జెడ్‌ 1ను లాంచ్‌ చేశారు.అయితే భారత్‌ లో  మాత్రం ఆండ్రాయిడ్‌ 8.0 ఒరియో ఒఎస్‌తో తీసుకొచ్చారు.దీంతో ఆండ్రాయిడ్‌ 8.0తో వచ్చిన తొలి నాన్‌-గూగుల్‌ స్మార్ట్‌ఫోన్‌గా ఎక్స్‌పిరియా ఎక్స్‌జడ్‌ 1 నిలిచింది.ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లో మరో అద్భుతమైన ఫీచర్‌ను సోని పొందుపరిచింది.దీని కెమెరాకు ఉన్న 3డి స్కానింగ్‌ మోడ్‌తో హై రిజల్యూషన్‌తో కూడిన 3డి ఫోటోలను క్యాప్చర్‌ చేయవచ్చు.దీన్ని మోషన్‌ ఐ కెమెరా అని సోనీ పేరుపెట్టింది.సోని ఎక్స్‌పిరియో ఎక్స్‌జెడ్‌1 మరిన్ని స్పెసిఫికేషన్‌లు  ఇలా ఉన్నాయి.5.2 అంగుళాల పుల్‌ హెచ్‌డి ట్రిలుమిసన్‌ డిస్‌ప్లే(1080 1920 పిక్సెల్‌ రిజల్యూషన్‌),గొరిళ్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌.అక్టాకోర్‌ స్పాప్‌డ్రాగన్‌  835 ప్రొసెసర్‌.4 జిబి ర్యామ్‌,64జిబి ఇన్‌ బిల్ట్‌ మెమొరీ(మైక్రోఎస్టితో 256 జిబి వరకు పెంచుకోవచుఎక్చ్‌),19 ఎంపి మోషన్‌ఐ వెనుక కెమెరా. వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌తో కూడిన 13 ఎంపి ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా,క్విక్‌ చార్జ్‌ 3.0 టెక్నాలజీతో 2700 ఎంఎహెచ్‌ బ్యాటరీ,ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌,4జి వివో ఎల్బీఈ,డ్యుయల్‌ సిమ్‌.