భారత్‌ యంత్రపరికరాల రంగానికి ఉజ్వల భవిష్యత్‌

TAMGO
టాగ్మా పారిశ్రామిక వేత్తల అంచనాలు
బెంగళూరు : భారత్‌లోనే కాకుండా విశ్వవ్యాప్తంగా ప్రతి పరిశ్రమలోను డైలు, మౌల్డులు కీల కంగా ఉంటాయి. పనిముట్ల పరిశ్రమకు ఎంతో ప్రాధాన్యం ఉండటం వల్ల పారిశ్రామికీకరణలో టూల్‌, గేజ్‌ తయారీదారులకు ఎంతోప్రాధాన్యత ఉందనిటాగ్మా ప్రతినిధిబృందం వివరించింది. బెంగళూరులో జరిగిన రెండురోజుల అంతర్జాతీయ సదస్సులో పరిశ్రమ తీరుతెన్నులు, భవిష్యత్‌ ధృక్పథంపై విస్తృత చర్చలు జరిగాయి. దేశంలో 100 మిలియన్ల ఉద్యోగాల సృష్టికి టూల్స్‌ మౌల్డ్‌ రంగాలు ఎంతో కీలకం అవుతాయని టాగ్మా అధ్యక్షుడు వెల్లడించారు. మొత్తం జిడిపిలో 25శాతం వాటా సాధిస్తుందని, ఉత్పత్తి అభివృద్ధి, నాణ్యత మెరుగైన ఉత్పాదకత లక్ష్యంతో టాగ్మా పనిచేస్తుం దన్నారు. పనిముట్ల తయారీరంగంలో 65శాతం ఆటోమొబైల్‌ పరిశ్రమ ఒక పెద్ద చోదకశక్తిగా నిలి చింది. టూలింగ్‌పరిశ్రమపై ఎక్కువ ఆటోమొబైల్స్‌ ఆధారపడి పనిచేస్తాయి. 2014-15లో 16,625 కోట్ల విలువైన టర్నోవర్‌ ఉంటే 6.2శాతం వృద్ధిని సాధించిందని, ఎగుమతుల విలువ 2869 కోట్లుగా ఉందన్నారు. రానున్న సంవత్సరాల్లో పరిశ్రమ మళ్లీ రెండంకెల వృద్ధిని చేసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా. భారతీయ కంపెనీలు యూరోప్‌, ఆగ్నేయాసియాలో తమ ఉనికిని చాటడంకోసం తయారీ కేంద్రాలు ప్రారంభించాలని చూస్తున్నాయి. భారత్‌ తయారీ రంగం ప్రపంచ వేదికపై తన ఉనికిని స్థిరపుచుకోవాలంటే ముందు టూల్స్‌ అండ్‌ గేజ్‌ తయారీ రంగాన్ని వృద్ధి అవసర మని పరిశ్రమనిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పరంగా మూలధనం పెట్టుబడులపై మరింత ప్రోత్సాహం ఉంటే రానున్న కొద్ది సంవత్సరాల్లోనే యంత్రపరికరాల పరిశ్రమ ఊహించని ఎదుగు దలకు చేరుతుందన్నారు. ప్రస్తుతం 50శాతం స్థానిక వాటాను సాధించడం యంత్రపరికరాల మార్కెట్‌లో ప్రపంచంలోనే భారత్‌ ఏడోస్థానం నుంచి మూడోస్థానానికి పెరిగిందన్నారు. యంత్ర పరికరాల ఉత్పత్తి దేశాల్లో పదమూడవ స్థానం నుంచి ఐదోస్థానానికిఎదిగిందని అభివృద్ధికి ఇదొక మంచి పరిణామంగా టాగ్మా అభిప్రాయపడింది. జపాన్‌ జర్మనీ ఇటలీ వంటి దేశాలకు అధునాతన ఉత్పత్తి మార్గాల్లో దిగుమతుల పెంపుదలకు దోహదపడిందన్నది నిర్వివాదాంశం. ఆటోమోటివ్‌ పరిశ్రమ ఎదుగుదల ఈ విపణికి చోదకశక్తిగా పనిచేసింది. దాదాపు 40శాతం యంత్రపరి కరాల వినియోగం ఆటోమొటివ్‌రంగంలోనే ఉంది. ఫోర్డ్‌, ఇసుజి, సుజుకి, హోండా, బిఎండబ్ల్యు, మెర్సిడిస్‌బెంజ్‌ ఫియట్‌ వంటి అతిపెద్ద ఆటోరంగ పరిశ్రమలకు భారత్‌ ఒక ప్రముఖ ఎగుమతి కేంద్రంగాఉందని, ఉత్పత్తి ప్రక్రియలో ఈ పరిశ్రమలు యంత్రపరికరాల రంగానికి ఎంతో వెన్నుదన్నుగా ఉండే అవకాశం ఉందని అంచనా. ఇందుకోసమే భారత్‌లో ఉత్పత్తి అవుతున్న యంత్రపరికరాలను ప్రపంచానికి చాటిచెప్పే ఉద్దేశ్యంతో బెంగళూరులో డైమౌల్డ్‌ ఇండియా పదవ సదస్సు, ఎక్స్‌పోను నిర్వహించామని సంఘం ప్రకటించింది.