భారత్‌ కాఫీ ఎగుమతుల్లో మందగమనం

COFFEE
COFFEE

భారత్‌ కాఫీ ఎగుమతుల్లో మందగమనం

బెంగళూరు,: ట్రేడర్లు మంచి ధరలకోసం వేచిచూసే ధోరణి అవలంభిస్తుండటంతో కాఫీ ఎగుమతులు మందగమనంతో ఉన్నాయి. కాఫీ బోర్డు ఉత్పత్తుల అంచనాలను చూస్తే అరబికా పంటసైజు 96,200 టన్నులుగా ఉంది. గత ఏడాది 1.035 లక్షల టన్నులతో పోలిస్తే ఏడు శాతం తక్కువగాఉంది. అలాగే రోబస్తా కూడా పది శాతం తక్కువగా ఉంది. 2.205 లక్షల టన్నులని అంచనా. గత ఏడాది 2.445 లక్షల టన్నులతో పోలిస్తే తక్కువే. మొత్తం ఉత్పత్తి 9శాతం క్షీణిం చిందని అంచనా. గతఏడాది 3.48లక్షల టన్నుల నుంచి 3.16 లక్షల టన్నులకు పడిపోయింది. ఉత్పత్తి లక్ష్యాలు క్షీణించడంతో పాటుధరలు కూడా ఆశాజనకంగా లేకపోవడంతో కాఫీ ఎగుమతులు కూడా మందగమనంతో ఉన్నాయి. ప్రస్తుత కేలం డర్‌ సంవత్సరంలో తమ ఉత్పత్తులను ధరలు మెరుగుపడితేనే విక్రయిం చాలని ఉత్పత్తిదారులు నిర్ణ యించుకున్నారు. యూరోప్‌ లో అరబికా కొనుగోలు దారులు ప్రత్యేకించి జర్మ నీ కొనుగోలుదారులు ఇతర అమెరికన్‌ వెరైటీల వైపు మళ్లడమే ఇందుకు కీలక మని తేలింది. కాఫీ ఉత్పత్తిదారులు ఆశించి నంతగా యూరోప్‌ కొను గోలుదారులు ధరలివ్వడంలేదు వీటికితోడుఉత్తరసెంట్రల్‌ యూరోప్‌ ప్రాంతాల్లో గడచిన నాలుగేళ్లుగా మంచి మార్కెట్‌ సాధించిన భారత్‌ కాఫీ ఇపుడు మధ్య అమెరికా ఉత్పత్తిదారులైన హోండురాస్‌, కొలం బియా ప్రాంతాలవైపు జర్మనీ కొనుగోలుదార్లు దృష్టిపెట్టినట్లు కాఫీ ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు రమేష్‌ రాజా వెల్లడించారు.

ఇక రోబస్టా మార్కెట్‌పరంగాచూస్తే ఇటలీ మార్కెట్‌ పటిష్టంగా నే ఉంది. భారత్‌తో పోలిస్తే కొలంబియా, హోండు రా వెరైటీలు ఐదు నుంచి ఏడుశాతం చీప్‌గా రావ డంతో ఇపుడు భారత్‌ కాఫీకి వింతపరిస్థితి ఎదుర యింది. అరబికా ఎగుమతులకు పర్మిట్లు కూడా 46శాతం కాఫీబోర్డు తగ్గించింది. జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 8 మధ్యకాలంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పర్మిట్లు తగ్గించింది. దీనివల్ల భారత్‌లోని ప్రీమియం కాఫీ వెరైటీపై కొనుగోలు దారులకు ఆసక్తి తగ్గిందని స్పష్టం అవుతోంది. ఇక రోబస్టా, ఇన్‌స్టంట్‌ కాఫీలకు స్వల్పస్థాయి ఎగుమ తులు మాత్రమే ఉన్నాయి. న్యూయార్క్‌ టెర్మినల్‌ ధరల్లో భారత్‌ ప్రీమియం కాఫీ అరబికా 15-20 సెంట్లు అధి కంగా ఉంది. అరబికా క్షేత్రస్థాయి ధర లు 50కిలోల బస్తాకు 9300 నుంచి 9700గా ఉంది. అంతర్జాతీయంగా కూడా కాఫీ ఉత్పత్తి తగ్గి నందున ధరలు పెరిగేంతవరకూ ఎగు మతులపై వేచిచూడాలన్న నిర్ణ యంలో ట్రేడర్లు ఉన్నారు. మరో రెండువారాల్లో కొత్తఅరబికా పంటచేతి కి వస్తుంది. రోబస్టా కాఫీ చిక్‌మగలూరు, కొడగు ప్రాంతాల్లో ఇపుడిపుడే కాఫీ తీస్తు న్నారు. అయితే ప్రతి రెండు, మూడేళ్లకోసారి మార్కెట్‌ ఇదే తరహాలో ఉంటుందని, అంతమాత్రాన భారత్‌ కాఫీకి మార్కెట్‌లేదని భావించలేమని భారత్‌కాఫీకి అంతర్జాతీ య మార్కెట్‌లోమంచి వాటాఉందని నిపుణులు చెపు తున్నారు. వాణిజ్యవర్గాల కథనం ప్రకారం 25-30 శాతం అరబికా కాఫీ పంటతోపాటు రోబస్టాస్‌లోని ఐదోవంతు పంట ప్రస్తుతం చేతికందిందని, ఇప్ప టికే ట్రేడింగ్‌ జరిగిందని చెపుతున్నారు. అయితే ప్రపంచ మార్కెట్లలో ధరలు మందగించడంతో వ్యాపారం కూడా అంతంతమాత్రంగానే ఉంది.