భారత్‌ ఆర్ధికవృద్ధి 7.5%: ప్రపంచబ్యాంకు అంచనా

ECONOMIC GROWTH
ECONOMIC GROWTH

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్ధికవృద్ధి 7.3శాతంగా ఉంటుందనిప్రపంచ బ్యాంకు అంచనావేసింది. మరింతగా కొనసాగుతూ 2019-20 ఆర్ధికసంవత్పరంలో7.5శాతానికి చేరుతుందని ప్రపంచ బ్యాంకు ద్వైవార్షిక నివేదికలో వెల్లడించింది. భారత్‌ అభివృద్ధి నివేదికపట్ల ఇండియా వృద్ధి కథాకమామీషు పేరిట నివేదిక విడుదలచేసింది. ప్రస్తుత ఆర్ధికసంవత్సరం మార్చి31వ తేదీతో ముగిసేనాటికి భారత్‌ ఆర్ధికవృద్ధి 6.7శాతం మాత్రమే ఉంటుందని అంచనావేసింది. ఎనిమిదిశాతం ఆర్ధికవృద్ధి ప్రస్తుత సంస్కరణల అజెండాకు అవసరమని, మరింత వృద్ధిసాగించాలన్నా విశ్వవ్యాప్తం కావాలన్నా ఆర్ధికవృద్ధి ఎనిమిదిశాతానికి రావాల్సిందేనని బ్యాంకు అంచనావేసింది. పెద్దనోట్లరద్దు,జిఎస్‌టిలనుంచి భారత్‌ ఆర్ధికవ్యవస్థ కొంత రికవరీ పథంలో ఉందని సానుకూల అంశాలతో వృద్ధిరేటు మరికొంతముందుకువస్తుందని, ఏడాది గడిచేసరికి 7.5శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. 2016 నవంబరులో ప్రభుత్వం పెద్దనోట్ల రద్దునుప్రకటించింది. నల్లధనం అరికట్టడం,మనీలాండరింగ్‌ నిరోధించేందుకు భారత్‌ ఈ అతిపెద్ద కార్యాచరణను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా పరోక్షపన్నులరంగంలో నెలకొన్న బహుళపన్నులవిధానం స్థానంలో ఒకే పన్ను పేరిట జిఎస్‌టిని అమలుచేసింది. ఈ రెండు కార్యాచరణల ద్వారా భారత్‌లోని ఆర్ధికకార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారత్‌ ఆర్ధికవద్ధి ఏప్రిల్‌జూన్‌త్రైమాసికంలో 5.7శాతంగా నిలిచింది. తదనంతర త్రైమాసికాల్లో స్వల్పంగా వృదిధని సాధించిందనే చెప్పాలి. ఆర్ధికవృద్ధి 6.6శాతానికి వృద్ధిచెందుతుందని అంచనావేస్తున్నారు. రెండో ముందస్తు అంచనాలప్రకారంచూస్తే కేంద్ర అర్ధగణాంకశాఖ గణాంకాలు 7.1శాతంగా ఉంటుందని, అంచనావేసింది. అంతకుముందు అంచనాల్లో 6.5శాతంగా మాత్రమే వెల్లడించింది. పార్లమెంటులోప్రవేశపెట్టిన ఆర్ధికసర్వే చూస్తే 7 నుంచి 7.5శాతంగా ఉంటుందని అంచనా. ప్రపంచ బ్యాంకు నివేదిక పరంగాచూస్తే వృద్ధిరేటు సమీకృతం పద్దతిలో ఆర్ధికవ్యవస్థకు ధీటుగా ఉంటుందని చెపుతోంది.భారత ప్రభుత్వరంగం పనితీరు కూడా కొంతమేర ఆర్ధికవృద్ధికి కీలకం అవుతుందని ప్రపంచ బ్యాంకు అంచనావేసింది.