భారత్‌లో సెకండ్‌హ్యాండ్‌ స్మార్ట్‌ఫోన్లకు గిరాకీ!

SECOND HAND PHONES
SECOND HAND PHONES

న్యూఢిల్లీ: భారత్‌ మార్కెట్లలో కొత్త స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్‌ పెరుగుతున్నట్లే వచ్చే రెండేళ్లలో సెకండ్‌హ్యాండ్‌ స్మార్ట్‌ఫోన్లకుసైతం డిమాండ్‌ ఫెరుగుతుందని అంచనా. ఎంపిక చేసిన బ్రాండ్లలో సెకండ్‌హ్యాండ్‌కొనుగోలుకుసైతం ఇష్టపడుతున్నారు. వీటిలో ఎక్కువగా యాపిల్‌, శాంసంగ్‌ ఇప్పటికే అత్యధిక డిస్కౌంట్‌ ధరల్లో లభిస్తున్నాయి. నిపుణులు, విశ్లేషఖుల అంచనాలనుచూస్తే సెకండ్‌హ్యాండ్‌ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ 2019-2020 సంవత్సరాల్లో 27శాతంపెరుగుతుందని అంచనావేస్తుఆ్నరు. ఇప్పటికే ఆన్‌లైన్‌బేరసారాలు ముమ్మరంగా సాగుతున్న ఈ సెకండ్‌హ్యాండ్‌ఫోన్లపరంగాచూస్తే అమెజాన్‌, క్యాషిఫై, షాప్‌క్లూస్‌, టోగోఫోగో వంటిసంస్థలు సైతం వీటి విక్రయాలకు ఆసక్తిచూపిస్తున్నాయి. ఏటికేడాది ఈ సెకండ్‌హ్యాండ్‌ హ్యాండ్‌సెట్ల మార్కెట్‌ 400శాతం చొప్పున పెరుగుతూ వస్తోంది. 2017లోనేమొత్తం ఈ మొబైల్‌ఫోన్‌ మార్కెట్‌ రెట్టింపు అయిందని అమెజాన్‌ ఇండియా ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అమెరికా కేంద్రంగా ఉన్న ఆన్‌లైన్‌ రిటైలింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ ఖచ్చితమైన గణాంకాలను ఇవ్వలలేకపోయినా సెకండ్‌హ్యాండ్‌ కేటగిరీ పై ఎక్కువ మంది కస్టమర్లు ఎంపికచేసిన బ్రాండ్లలోకొనుగోలుచేసేందుకే ఇష్టపడుతున్నారు. 50శాతం కొత్త ఫోన్లలో తక్కువ ఉంటుందని, వృద్ధిరేట్లపరంగా కూడా కొంత మార్కెట్‌పెరుగుతున్నందున ఆన్‌లైన్‌ సంస్థలుసైతం వీటి అమ్మకాలకు ఆసక్తి చూపిస్తున్నాయి. క్యాషిఫై వ్యవస్థాపకులు నకుల్‌కుమార్‌ మాట్లాడుతూ గత ఏడాదికంటే ఈ ఫోన్లు మూడురెట్లు అమ్మకాలుపెకరిగాయని, ఇదే తీరు ఈ ఏడాదిసైతం కొనసాగుతుందన్నారు. షాప్‌క్లూస్‌ ఇప్పటివరకూ 5780 సెకండ్‌హ్యాండ్‌ఫోఉ్ల విక్రయించింది. ఎక్కువగా నోకియా,శాంసంగ్‌ ఫోన్లు రెండు,మూడోశ్రేణినగరాల్లో అమ్ముడుపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 35శాతంపెరిగినట్లు అంచనావేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ వాస్తవానికి 35 మిలియన్లుగా ఉంటే వాటిలో రెట్టింపు మార్కెట్‌ సెకండ్‌హ్యాండ్‌ఫోన్లకు ఉంటుంది. ఎక్కువ మంది కస్టమర్లు తమస్మార్ట్‌ఫోన్‌ ఒకసారి వినియోగించిన వాటికే ఇష్టపడుతున్నట్లు క్యాషిఫై కుమార్‌ వెల్లడించారు. మొత్తం 25శాతం ఈకేటగిరీఫోన్లు మార్కెట్లలో విరకయిస్తున్నారు. ఇక డేటా వినియోగం పెరుగుతున్న కొద్దీ ప్రీఓన్డ్‌ స్మార్ట్‌ఫ్లో వినియోగం పెరుగుతూ వస్తోంది. సెకండ్‌హ్యాండ్‌ఫోన్లు 25శాతం 2017లో పెరిగాయి. 12 మిలియన్‌ యూనిట్లకుపైబడి అమ్మకాలుజరిగాయి. వీటిలో ఎక్కువశాతం అంటే మూడొవంతు యాపిల్‌;శాంసంగ్‌కంపెనీలే ఉన్నాయని కౌంటర్‌పాయింట్‌ టెక్నాలజీ మార్కెట్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. ఇక ఈ విభాగంలో గ్లోబల్‌మార్కెట్లలో గత ఏడాది 13శాతం వృద్దినమోదుచేసింద.ఇ సుమారుగా 140మిలియన్‌ యూనిట్లు విక్రయించాయి. భారత్‌లో అత్యధికశాతం శరవేగంగా సెకండ్‌హ్యాండ్‌ మార్కెట్‌ వృదిధచెందుతోందని, ఆ తర్వాత ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లో అధికంగా ఉందన్నారు. మెగా ఎలక్ట్రానిక్‌ డిస్ట్రిబ్యూటర్లు ఇన్‌గ్రామ్‌మైక్రో, రెడింగ్టన్‌; హెచ్‌సిఎల్‌ వంటికంపెనీలతోపాటు మేజర్‌ ఇకామర్స్‌ంసస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటివి కూడా సెకండ్‌హ్యాండ్‌ కేటగిరీపై ఆసక్తిని చూపిస్తున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వంసైతం మేకిన్‌ ఇండియా కార్యాచరణకింద రీఫర్బిష్‌మెంట్‌ఫోన్ల యూనిట్లను ప్రోత్సహిస్తోంది. దీనివల్ల సెకండ్‌హ్యాండ్‌మార్కెట్‌మరింతపెరుగుతుందని అంచనా. వీటితోపాటుగా దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్న కేంద్రం దేశీయ మొబైల్స్‌కంటే ముందు సెకండ్‌హ్యాండ్‌ యాపిల్‌, శాంసంగ్‌ఫోన్లకే ఎక్కువ ఆసక్తిచూపిస్తున్నారు. ఇప్పటికే ఈ డిస్ట్రిబ్యూటింగ్‌కంపెనీలు,గ్రీన్‌డస్ట్‌ వంటివి తమమార్కెట్‌ వ్యూహాలను సరిచేస్తున్నాయి. ఫోన్లను అనుకున్న మొత్తం కంటే ఎక్కువ ఆర్డర్‌చేయడం, విడిభాగాలుసైతం అనుకున్నస్థాయిలో కొనుగోలుచేయడంలేదు. దీనివల్లపెట్టుబడులు నిలిచిపోతున్నట్లు భావిస్తున్నాయి. చివరిలో 20శాతం ఫోన్ల విక్రయంలోనే సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇవి అమ్ముడుకాకపోతే లాభదాయకత దెబ్బతింటున్నదని కొందరు సెల్లర్లు వాపోతున్నారు. ఇక ఈరంగంలో విక్రేతలు ముందుగా చెప్పాలంటే 30రోజులలోపే మొత్తం ఫోన్లను విక్రయిస్తేనే గిట్టుబాటవుతుంది. గ్రీన్‌డస్ట్‌ వ్యవస్థాపకులు హితేంద్ర చతుర్వేది మాట్లాడుతూ చివరినిమిషం వరకూ మొత్తం ఎలాంటిఫోన్లు అయినా అమ్మితేనే లాభదాయకత ఉంటుందని చెప్పారు.మొత్తం మీద భారత్‌లో కూడా ఇతర ఆసియా దేశాలతరహాలో సెకండ్‌హ్యాండ్‌ఫోన్లకు గిరాకీ పెరిగింది. ఈఫోన్లు ఏటికేడాది భారత్‌లో భారీ ఎత్తున డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. సెకండ్‌హ్యాండ్‌ఫోన్లవరకూ ఏటికేడాది చూస్తే 400శాతం వృదిధతో ఉందని, మొబైల్‌ఫోన్ల విక్రయాలుసైతం 2017లో రెట్టింపు అయినట్లు తెలుస్తోంది.