భారత్‌కు 25.4బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు

DOLLAR
DOLLAR

భారత్‌కు 25.4బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు

ముంబయి,జూలై 27: విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు 25.4 బిలియన్‌ డాలర్లు భారత్‌ ఈక్విటీ డెట్‌ మార్కెట్లలో పెట్టుబడులుపెట్టారు. నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ గణాంకాలను బట్టిచూస్తుంటే భారత్‌ ఆర్థికవృద్ధి పునరుద్ధ రణ కావడం, ఇటీవలి ప్రభుత్వ సంస్కరణలు బ్యాంకింగ్‌ రంగంలో తెచ్చిన ఆకస్మిక మార్పులు వంటివి కొంత పెట్టుబడులకు ఊతం ఇచ్చాయనే చెప్పాలి. వీటివల్ల డెట్‌రంగంలో పెట్టుబడులు 16.9 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. భారతీయ కరెన్సీలో చూస్తే 10,389 కోట్లు. ఈక్విటీల మార్కెట్లలో 8.5 బిలి యన్‌ డాలర్లు భారతీయ కరెన్సీలో అయితే 55,959 కోట్లు రూపాయలుగా ఉన్నాయి. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారతీయ సెక్యూ రిటీల మార్కెట్లలో లెక్కకు మించిన పెట్టుబ డుల లావాదేవీలు నిర్వహించారు. రైట్స్‌, బోనస్‌ జారీ, ప్రైవేటు ప్లేస్‌మెంట్‌, విలీనాలు, కొనుగోళ్లు లావాదేవీల్లో ఇన్వెస్టర్లు చురుకుగా పాల్గొన్నట్లు కనిపిస్తోంది. ఈక్విటీ విభాగంలో బెంచ్‌మార్క్‌సూచీలు భారీగా పెరగడంతో పెట్టుబడులకు ఊతంఇచ్చినట్లయింది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌, నిఫ్టీ 50సూచీలు కనీసం 22శాతం ఈఏడాదిలో ఇప్పటివరకూ పెరిగాయి.

ప్రపం చంలోని ఇతర అన్ని మార్కెట్ల కంటే భారీగా వృద్ధిని సాధించినట్లు తేలింది. మంగళవారం ఒక్కరోజే నిఫ్టీ 50సూచి ఈక్విటీమార్కెట్లలో మొట్ట మొదటిసారి 10,000 పాయింట్లను తాకింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్‌సూచీలు 30 శాతానికిపైగా పెరిగాయి. నిపుణుల అంచనాలను చూస్తే భారత్‌కు మరింతగా విదేశీ పెట్టుబడులు వస్తాయని తెలుస్తోంది. దేశీయంగాను, విదేశీ ఇన్వెస్టర్లు కూడా భారత్‌లోని స్థిరమైన రాజకీయ వాతావరణం, ఆర్థికవృద్ధిలో పెరుగు దల, విధివిధానాల్లో సంస్కరణలు, కార్పొరేట్‌ ఫలితాల రాబడుల్లో పురోగతి వంటివి వచ్చే కొన్నేళ్లపాటు కొనసాగుతాయని అంచనావేస్తున్నారు. సమీపభవి ష్యత్తులో కొంతమేర ఉపసంహరణలు, దాడులు ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. అలాగే అంతర్జాతీయంగా కొన్ని దేశాల కేంద్ర బ్యాంకులు భారత్‌ పట్ల సానుకూలంగా ఉన్నాయి.

ఇక దేశీయంగా ఆర్థిక వతావరణం స్థిరంగా ఉంది. కార్పొరేట్‌రాబడులు క్రమేపీ పెరుగుతున్నాయని ఈ సంఘటన లు అన్నింటినీ పరిగణనలోనికి తీసుకుంటే భారతీయ మార్కెట్లకు మరింతగా విదేశీ నిధులు వస్తాయని మిజుహోబ్యాంకు భారతీయ వ్యూహకర్త తీర్ధాంకర్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు. 2014 ఆర్థికసంవత్సరంలో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్లలో 42.4 బిలియన్‌ డాలర్ల నిధులను పెట్టుబడులు పెట్టారు. 2000సంవ త్సరం తర్వాత ఇదే మెగా పెట్టుబడులుగా నిలిచింది. తదనంతరం నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేయడం పెట్టుబడులు కూడా క్రమేపీ పెరిగా యి.

2015లో 10.8 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. 2016లో ఎక్కువ అమ్మకాలకే మొగ్గుచూపించి 3.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. కొన్ని ప్రతికూల అంశాలు కూడాలేకపోలేదు. గడచిన మూడునెలలుగా ఎగుమతులు పడిపోతున్నాయి. దీనివల్ల ఆర్థికవృద్ధికి అవరోధంగా నిలుస్తోంది. అయితే కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు కూడా కొంత ఆశాజనకంగా రావడం కొంత మద్దతు పెంచినట్లయింది. యుబిఎస్‌ బ్యాంకు తన నిఫ్టీ50సూచీని 7500 స్థాయికి అంచనావేసింది. ఎగువప్రాంతంలో పదివేల పాయింట్లకు చేరుతుందని వేసిన అంచనాలు వాస్తవమని నిరూ పితం అయ్యాయి. మొత్తం మీదప్రధాని మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, విధివిధానాలపై విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల కు ధీమా పెరుగుతుండటంతో పెట్టుబడులు సైతం పెరిగినట్లు తెలుస్తోంది.