భారత్‌కు వచ్చే విదేశీ జమల్లో తగ్గుదల

Dollors
Dollors

ముడిచమురుధరలు తగ్గమే కారణమంటున్న రేటింగ్స్‌
న్యూఢిల్లీ: గల్ఫ్‌దేశాల్లో ముడిచమురుధరల ప్రభావం కారణంగా భారత్‌కు విదేశాలనుంచి వస్తున్న జమలు తగ్గుతున్నాయి. ఒక్కసారిగా అనూహ్యస్థాయికి పెరిగిన ముడిచమురుధరలు ఇటీవలికాలంలో తగ్గుముఖం పట్టాయి. ఎక్కువగా భారత్‌కు వచ్చే విదేశీ జమలు గల్ఫ్‌దేశాలనుంచే ఉంటున్నాయి. అయితే డాలర్‌ నిధులు రాక అటూఇటూగా ఉండటంతో భారత్‌ కరెంటుఖాతాలోటు రానురాను పెరుగుతున్నది. ప్రపంచ బ్యాంకు గణాంకాలను ్పరిశీలిస్తే భారత్‌కు వస్తున్న విదేశీ జమలు 2017లో 69 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 9శాతంపెరిగాయి. గడచిన రెండుసంవత్సరాలతోపోలిస్తే ఈగణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న జమల్లో భారత్‌ వాటా స్వల్పంగా తగ్గింది. 2012లో 14శాతం ఉన్న జమలు 12శాతానికి తగ్గాయి. ఎక్కువశాతం వీటిలో గల్ఫ్‌దేశాలనుంచే వస్తునఆనయి. ముడిచమురుధరలు ఎక్కువ ప్రభావంచూపిస్తున్నాయి. ఇక వలసకార్మికులు రాబడులు కూడా తగ్గాయి. ముడిచమురు ధరలు 2015నుంచి 2016 సంవత్సరాల్లో పతనం కావడంతో కొంతమేర జమలు కూడా తగ్గాయి. ముడిచమురుధరలు తగ్గుదలతో భారత్‌కు మంచి లాభం కలుగుతుంది. అయితే వలసకార్మికులకు మాత్రం ప్రయోజనం నిల్‌ అని నిపుణులు చెపుతున్నారు. దేశ ముడిచమురు దిగుమతి బిల్లు తగ్గుతుంది. ముడిచమురుధరలు 30శాతం గడచిన రెండునెలల్లో తగ్గడం వల్ల జమల్లో కూడా తగ్గుదల కనిపించింది. ముడిచమురు ఉత్పత్తిచేసే దేశాలు కువైట్‌, ఓమన్‌, ఖతార్‌,సౌదీ అరేబియా, యునైటెడ్‌అరబ్‌ ఎమిరేట్స్‌ భారత్‌ జమల్లో 50శాతానికిపైగా కీలకం అవుతున్నాయి.2017లో ఈ జమల వాటా 50శాతంనుంచి 53శాతానికి పెరిగింది. ముడిచమురుధరలు గరిష్టంగాపెరిగితే భారత్‌ దిగుమతి చెల్లింపుల బిల్లును పెంచుతుంది. అయితే విదేశీ వలస కార్మికుల జమలు తగ్గుతాయి. ఎర్గో ఎనలిస్టులు అంచనాలప్రకారం కరెంటుఖాతాలోటు తగ్గుముఖం పడుతుంది. అయితే జమలు కొంతమేర సమస్యాత్మకం అవుతాయని వెల్లడించిన అంశాల్లో ప్రస్తుత జమలు నిజమేనని స్పష్టంచేస్తున్నాయి.2007లో 23.87శాతం ఉంటే 2017 నాటికి మొత్తంప్రపంచ దేశాల వాటాలో 9.02శాతానికి దిగజారింది.