బోర్డు ఆమోదం లేకుండా రూ.500 కోట్లు మళ్లింపు

singh brothers
singh brothers

న్యూఢిల్లీ: భారత్‌ పారిశ్రామికబ్రదర్స్‌ మల్వీందర్‌, శివీందర్‌సింగ్‌లు బోర్డు అనుమతిలేకుండా ఫోర్టిస్‌నుంచి రూ.500 కోట్లు తీసుకున్నట్లు ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ ఆస్తి అప్పుల పట్టీలో స్పష్టమయిందియింది. నగదు లేదా నగదు సమాన ఉత్పత్తులను వారు పొందినట్లు వెల్లడి అయింది. ఈ నగదు మొత్తం సింగ్స్‌ నియంత్రణలోనికే వివిధ మార్గాల్లో వెళ్లినట్లు తేలింది. డాలర్లలో చూస్తే సింగ్‌ బ్రదరతీసుకున్న సొమ్ము 78 మిలియన్‌ డాలర్లుగా ఉంది. స్టాక్‌ ఎక్ఛేంజిల్లోట్రేడ్‌ అయిన కంపెనీగా ఆసుపత్రి గ్రూప్‌లో సింగ్‌ సోదరులు బోర్డు అనుమతిలేకుండా ఏడాదిక్రితం ఈ మొత్తం డ్రాచేసినట్లు తెలుస్తోంది. సింగ్‌సోదరుల హయాంలో ఉన్నపుడే ఈ నిధులను బదలాయించారు. ఫోర్టిస్‌ ఆడిటర్‌ డెల్లాయిట్‌, హాస్కిన్స్‌ అండ్‌ సెల్స్‌ ఎల్‌ఎల్‌పి సంస్థ కంపెనీ రెండోత్రైమాసిక ఫలితాలపై సంతకం చేసేందుకు నిరరాకరించింది. ఈ నిధులు మొత్తం రిటర్నుచేయాలి లేదా ఖాతాలకు లెక్కచెప్పినతర్వాతనే సంతకంచేస్తామని వెల్లడించింది. అయితే సింగ్‌ సోదరులు ఈ నిధులను ఎందుకు తీసుకున్నారు? దేనికి వినియోగించారన్నది మాత్రం తెలియరాలేదు. ఫోర్టిస్‌ వ్యవస్థాపకులు మల్వీందర్‌సింగ్‌ ఆయన సోదరుడు శివీందర్‌లు తాము తీసుకున్న సొమ్మును వెనక్కు ఇచ్చేందుకు కసరత్తులు చేసుత్నఆ్నరు. దీనితో కంపెనీ తన ఆర్ధికఫలితాలను వెల్లడించేందుకు వీలుకలుగుతుందని చెపుతున్నారు. ఫోర్టిస్‌ కంపెనీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ కంపెనీ 473కోట్ల రుణాన్ని కొన్ని కార్పొరేట్‌ సంస్థలకు సహజసిద్ధమైన ట్రెజరీ కార్యకలాపాలుగా ఇచ్చిందని, జులై 2017 నాటికే ఇచ్చిందని అన్నారు. గత ఏడాదితోపాటు ప్రస్తుత ఆర్ధికసంవత్సరంలో సైతం కొన్ని రుణాలిచ్చిందని అన్నారు. ఈకంపెనీలు సహజంగానే సింగ్‌ కార్పొరేట్‌గ్రూప్‌లో కంపెనీలుగా ఉన్నాయని ఈ రుణాలను సంబంధిత పార్టీల లావాదేవీలుగా గుర్తించినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. అలాగే రీపేమెంట్‌ను కూడా ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఫోర్టిస్‌గురువారం ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పదవికి మల్వీందర్‌సింగ్‌రాజీనామా చేసినట్లు వెల్లడించింది. శివేందర్‌సింగ్‌ కూడా వైస్‌ఛైర్మన్‌పదవినుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఔషధ కంపెనీ విక్రయానికి సంబంధించి కోర్టు తీర్పు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేలింది. తమరాజీనామాలద్వారా కపంఎనీకి సంబంధించినప్రమోటర్లపై ఎలాంటిప్రభావం చూపించకూడదన్న నిర్ణయంతోనే జరుగుతున్నదని అంచనా. భారత కంపెనీలచట్టంప్రకారం ఎలాంటి లావాదేవీలకైనా బోర్డుఅనుమతి తప్పనిసరి. నిర్ణీతమొత్తం దాటినపక్షంలో బోర్డు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వాటాదారుల అనుమతులు కూడా విధిగా తీసుకోవాలి. ఎలాంటి అనుమతులు, ఆమోదం లేకుండా ఇలాంటి లావాదేవీలు నిర్వహించేందుకువీలులేదు. అది ఉల్లంఘించినపక్షంలో ఐదు లక్షల రూపాయలు జరిమానాకూడా ఉంటుంది. డెల్లాయిట్‌ అధికార ప్రతినిధి తమ ప్రశ్నలను ఫోర్టిస్‌కు పంపిస్తూ ఆడిటింగ్‌సంస్థ నిర్దిష్టమైన క్లయింట్‌ సమాచారాన్ని వెల్లడించలేమని వెల్లడించింది. రెండు,మూడు త్రైమాసిక ఫలితాలను ఈనెల 13వ తేదీ ప్రకటించాల్సి ఉంది. కంపెనీ నగదు నగదు సంబంధిత ఉత్పత్తులు 540 కోట్లుగా ఉన్నట్లు అంచనా. అంతకుముందు సంవత్సరం 140కోట్లతోపోలిస్తే ఎక్కువే. కంపెనీపరంగా ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌కు రుణభారం పెరిగింది. 2016లోనే 150కోట్ల డాలర్లకు పెరిగింది. భారతీయ బిజినెస్‌రంగంలో ప్రమోటర్లు కంపెనీని తమ భారీ వాటాతో నియంత్రించే అధికారం ఉంది. సింగ్‌సోదరులు ఫోర్టిస్‌లో 34శాతం వాటాలు కలిగి ఉన్నట్లు ఎక్ఛేంజి రిటర్నుల్లో స్పష్టంచేసారు. సింగ్‌సోదరులు న్యూయార్క్‌ కేంద్రంగా ఉన్నప్రైవేటు ఈక్విటీసంస్థ సిగ్యులర్‌ గఫ్‌ అండ్‌కో సంస్థపరంగా న్యాయస్థానంలో వాదనలు ఎదుర్కొంటున్నారు. సంస్థ నిధులను మరొక ట్రేడింగ్‌ సంస్థకు బదలాయించిందని, వాటిని పర్యవేక్షణ, సాయంచేసేందుకే ఈవిధంగా బదలాయించిందని ఆరోపించింది. వారి వ్యక్తిగత రుణాలను పరిష్కరించుకునేందుకే ఈనిధులు బదలాయించిందని ఢిల్లీ హైకోర్టులో సైతం కేసు దాఖలుచేసింది.
ఇక సింగ్స్‌ ఆర్ధికసేవల సంస్థ రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 21రుణాలు తీసుకుంది స్వతంత్ర కంపెనీలుగా ఉన్న ఈ కంపెనీలు 300 మిలియన్‌ డాలర్లవరకూ ఉన్నట్లు అంచనా. అదేరోజు ఈ మొత్తం సింగ్‌ సోదరుల సంస్థలకు వచ్చాయి. 2016 రికార్డులను కేంద్ర బ్యాంకు విచారణలో ఈవివరాలు వెల్లడి అయ్యాయి. అయితే సింగ్‌సోదరులు ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని కొట్టిపారేసారు. అయితే భారత సుప్రీంకోర్టు సింగ్‌సోదరులను ఫోర్టిస్‌లో వాటాలను విక్రయించడం కానీ, షేర్ల విభజనకానీ చేయవద్దని సూచించింది. దాయిచి సంస్థ పిటిషన్‌మేరకు సుప్రీం కోర్టు తననిర్ణయాన్నిప్రకటించింది. అలాగే ఢిల్లీకోర్టుద్వారా సింగపూర్‌ సంస్థ విధించిన జరిమానా 550 మిలియన్‌ డాలర్లు ఢిల్లీకోర్టు ఉత్తర్వులుజారీచేసింది. సింగపూర్‌ట్రిబ్యునల్‌లోని పిటిషన్‌ను విచారించిన తర్వాత సింగ్‌సోదరులు నష్టంతోపాటు వడ్డీతో సహా దాయిచీసాంక్యోకు చెల్లించాలని రూలింగ్‌ ఇచ్చింది. అయితే సింగ్‌ సోదరులు ఎలాంటి అవకతవకవకలు పాల్పడలేదని, నిబంధనల ప్రకారమే చేసినట్లు వెల్లడించారు. ఇటీవలి ఢిల్లీకోర్టు రూలింగ్‌ను సమీక్షచేస్తున్నట్లు వెల్లడించారు.