బిఎస్‌ఇ200 జాబితాలో 388బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు

DOLLAR
DOLLAR

బిఎస్‌ఇ200 జాబితాలో 388బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు

ముంబయి, ఆగస్టు 29: విదేశీ పెట్టుబడి స్థంలు దేశీయ ఈక్విటీల్లో ఈ ఏడాది జూన్‌వరకూ పెట్టు బడులు గణనీయంగా పెంచారు. గత ఏడాదితో పోలిస్తే 24.93శాతం పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు 388 బిలియన్‌ డాలర్లు బిఎస్‌ఇ 200 జాబితా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. దేశీయ సంస్థా గత ఇన్వెస్టర్లు 271బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. మూడునెలల్లోనే 11.8నుంచి 12.2శాతా నికి పెంచింది. మొత్తం మార్కెట్‌ విలువలు 1.557 లక్షలకోట్ల డాలర్లలో 24.93శాతం నిధులు అందా యి.

మార్చి, జూన్‌నెలల మధ్యకాలంలో సెన్సెక్స్‌ 4.4శాతం పెరిగితే నిఫ్టీ 3.8శాతం పెరిగింది. దేశీయసంస్థాగత ఇన్వెస్టర్లుబ్యాంకులు, ఆర్థిక సంస్థ లు వంటివాటిలో ఇప్పటివరకూ 07 బిలియన్‌ డాల ర్ల పెట్టుబడులున్నాయి. మ్యూచువల్‌ఫండ్స్‌ 83 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఎల్‌ఐసి ఒక్కటే 81 బిలియన్‌డాలర్ల వాటాతోఉంది. బిఎస్‌ఇ 200 జాబితాలో విదేశీయుల వాటా క్రమానుగతం గా పెరుగుతున్నది.జూన్‌నెలో 20బిలియన్‌ డాలర్లు పెరిగి 388 బిలియన్‌ డాలర్లకు చేరింది. మార్చి నాటికిఉన్న 368 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఒక్కసారిగా పెరిగింది. అయితే విలువలపరంగా ప్రమోటార్ల వాటా 48.9శాతం నుంచి 47.8శాతా నికి క్షీణించింది.

ఈ కాలంలోనే పెట్టుబడులు 745 బిలియన్‌ డాలర్ల నుంచి 733 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి ప్రమోటర్ల వాటాపరంగాచూస్తే 27.54శాతం నుంచి 7.51శాతానికి దిగజారింది. స్వల్పంగానే ఉన్నప్పటికీ కొంత కలవరం వ్యక్తం అవుతోంది. జూన్‌చివరినాటికి 12.40శాతం నుంచి 11.10శాతానికి పడిపోయింది. అలాగే విదేశీ ప్రమో టర్ల వాటాలు కూడా 9.23శాతం పెరిగి 8.96 శాతానికి చేరాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా కూడా జూన్‌నాటికి 7.66శాతం నుంచి 7.83శాతానికి పెరిగింది. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు ప్రస్తుత త్రైమాసికంలోనే విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు ఆరత్‌లోని ఈక్విటీల్లో రూ.1400కోట్ల విలువైన వాటాలను కొనుగోళ్లు చేశారు.

ఫార్మా టెక్నాలజీ షేర్లు సంస్థాగత దేశీయ ఇన్వెస్టర్లు ఎక్కువగా బ్యాంకింగ్‌ పారిశ్రామికరంగాలు, మెటల్‌, మైనింగ్‌ వాటాలపై దృష్టిపెడితే విదేశీ ఇన్వెస్టర్లు ఫార్మా, టెక్నాలజీ రంగాలపై ఎక్కువ దృష్టిపెట్టారు. జూన్‌ త్రైమాసికంలో ఎఫ్‌పిఐ వాటా బిఎస్‌ఇ 200 సూచీలో 20 బిలియన్‌డాలర్లుగా ఉంది. కోటక్‌ గణాంకాలన్రకారంచూస్తే అత్యధిక విదేశీపెట్టుబడులు బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, దాల్మియా భారత్‌ సంస్థల్లో ఉన్నాయి. ఐడిఎఫ్‌సి ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జి, బిఎఫ్‌ఐ రంగంలో తమ వాటాలను నేషనల్‌ అల్యూమినియం కంపెనీలో పెచుకు న్నాయి. టాటాకెమికల్‌, వేదాంతలో కూడా ఇదే తీరులో కొనసాగాయి. అతి తక్కువగా ఉన్న విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడు ల్లో ఐడిఎఫ్‌సి, రిలయన్స్‌ కమ్యూ నికేషన్స్‌, అపోలో టైర్స్‌ వంటి వాటిలో దిగ జారాయి. మ్యూచువల్‌ఫండ్స్‌ పరంగా సుప్రజిత్‌ ఇంజినీరింగ్‌, సిజి వినియోగరంగం, క్రిసిల్‌లో ఉన్నాయి. ఇక బ్యాంకింగ్‌, ఆర్థికరంగం, బీమా రంగాలపరంగా జెకెసిమెంట్‌, ఉజ్జీవన్‌, అదాని ఎంటర్‌ప్రైజెస్‌లో పెట్టుబడులు పెట్టాయి.