బిఎండబ్ల్యు బైక్‌ల ఎగుమతికి టివిఎస్‌ సిద్ధం

TVS11
TVS1

బిఎండబ్ల్యు బైక్‌ల ఎగుమతికి టివిఎస్‌ సిద్ధం

హోసూర్‌(తమిళనాడు),: ద్విచక్రవాహనాల్లో అగ్ర గామిసంస్థగా ఉన్న టివిఎస్‌మోటార్‌ కంపెనీ జర్మనీకి చెంది న బిఎండబ్ల్యు మోటారుసైకిళ్లను ఎగుమతిచేస్తోంది. బిఎం డబ్ల్యు బ్రాండ్‌ 310సిసి బైక్‌లను ఎగుమతిచేస్తున్నట్లు కంపెనీ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. టివిఎస్‌ మోటా ర్‌ కంపెనీ ఇందుకు రూ.350 కోట్ల పెట్టుబడులు పెడుతు న్నది. ప్రస్తుత యూనిట్‌ను విస్తరించేందుకు ఈ పెట్టుబడు లు పెడుతున్నట్లు తేలింది. అంతేకాకుండా ఒకకొత్త మోడల ్‌ను స్కూటర్‌, మోటారుసైకిళ్ల విభాగంలో ప్రారంభిస్తుందని తేలింది. టివిఎస్‌ మోటార్స్‌, బిఎండబ్ల్యు సంయుక్తంగా మోటారుసైకిళ్లను ఉత్పత్తిచేసేందుకు ఒప్పందంచేసుకున్నాయి.250-500 సిసి మోటారు సైకిళ్లను ఉత్పత్తిచేసి ఎగుమతిచేసేందుకు టివిఎస్‌ నిర్ణయించింది. 310సిసి మోటార్‌సైకిల్‌ ఇంజన్‌ జర్మనీ ఆటోమొబైల్‌ దిగ్గజంతో కలిసి రూపొందించింది. కంపెనీ ఉత్పత్తిచేసిన 310సిసి బైక్‌ ‘అకులాను సొంత డీలర్‌షిప్‌లపై విక్రయిస్తుందా లేక వేరుగా విక్రయాలు జరుపుతుందా అన్నది స్పష్టం కాలేదు. భారత్‌లో వచ్చే ఆర్ధ్థికసంవత్సరం నుంచి విక్రయాలు చేపడుతుంది. కంపెనీ ఇండోనేసియా వెంచర్‌ వచ్చే ఆర్థిక సంవత్సరానికి లాభనష్టాలులేని దశకు చేరుతుందని, నష్టాలు సగానికిపైగాతగ్గినట్లు కంపెనీ ఎండి రాధాకృష్ణన్‌ వెల్లడించారు. ఆరు మిలియన్‌ డాలర్లనుంచి మూడు మిలియన్‌ డాలర్లకు నష్టాలు తగ్గాయి.