బడ్జెట్‌పైనే రియాల్టీ రంగం ఆశలు

REALTY
రాయితీల కోసం పలు ప్రతిపాదనలు
ముంబై : రియల్‌ఎస్టేట్‌రంగానికి సంబంధించినంత వరకూ కొత్త బడ్జెట్‌లో కొంత ఉపశమనం లభిస్తుందని రియాల్టీ డెవలపర్లు ఆశలు వ్యక్తంచేస్తున్నారు. గడచిన కొంతకాలంలో మందగమనంతో ఉన్న ఈరంగం కొత్తబడ్జెట్‌లో కల్పించే రాయి తీలు ప్రోత్సాహకాలు ఎంతో మద్దతునిస్తాయన్నది నిపుణుల వాద న. వివిధ రంగాల పరిశ్రమలు కోసం అమలవుతున్న ప్రభుత్వ విధానాలే ఇక్కడ కూడా ఉన్న రియాల్టీ రంగం   సంక్లిష్టపరిస్థి తుల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం మారుతున్న ఆర్థిక స్థితిగతుల కారణంగా బడ్జెట్‌ కూడా ఎంతో కీలకంగా మారింది. రియాల్టీ రంగానికి మరింత ప్రాధాన్యతకలిగిన బడ్జెట్‌గా రావాలన్నది అంచనా. నిర్మాణంలో ఉన్న ఆస్తులు కొనుగోలుచేస్తే బయ్యర్లు పన్నురాయితీలను రెండులక్షల వరకూ క్లెయిం చేసుకోవాల్సి ఉంటున్నది. నిర్మాణం మూడేళ్లలోపు పూర్తయితే ఈ సదుపా యం 30వేలకు తగ్గిపోతుంది. బిల్డరు నిర్మాణం జాప్యం చేస్తే వడ్డీమరింతగా చెల్లించాల్సి ఉంటున్నది. మొదటిసారిగా ఇళ్లకొను గోలుదారులు అద్దెకోసం కాకుండా సొంతంగా వినియోగిం చుకునేందుకు కొనుగోళ్లు చేస్తున్నారు. హౌసింగ్‌ రుణాలపై వడ్డీలు చెల్లిస్తున్నప్పటి నుంచి రాయితీలు అమలుచేయాలన్న వాదన కూడా తెరపైకి వస్తోంది. మూలధన లబ్ధినుంచి ఇళ్లను కొనుగోలుచేస్తే నిర్మాణం కూడా మూడేళ్లలోపు పూర్తిచేయాల్సి ఉంటుంది. అలా ఉన్న పక్షంలోనే మినహాయింపులు అమలు అవుతాయి. ఒకవేళ బిల్డర్లు జాప్యం చేస్తే నిర్మాణం మూడునుంచి ఐదేళ్లవరకూ   పొడిగించే అవకాశం ఉంది. మెట్రోపాలిటన్‌ నగరా ల్లో ఇళ్లను కొనుగోలుచేసుకునే వారికి పన్ను మినహాయింపుల రాయితీ ప్రస్తుతం రెండులక్షల పరిమితివరకూ ఉంది. మెట్రోనగ రాల్లో అత్యధికంగా కోటి రూపాయలు ఆపైబడి ఇళ్లను విక్రయిం చాల్సి విక్రయిస్తారు. పన్ను రాయితీలతోపాటు ఇళ్లబీమా ప్రీమి యంలు కూడా అమలుచేసి బయ్యర్లను ఆకర్షించేందుకు కృష ిచేయాల్సి ఉంటుంది. పన్ను మినహాయింపు పరిమితి మరో లక్షల రూపాయలకు పెంచాలని కోరుతున్నారు. ఇక ఇంటిఅద్దె అలవెన్సుల పరిమితిని కూడా పెంచాలని కోరుతున్నారు. ఇప్పటివరకూ నెలకు రెండువేల రూపాయలు చొప్పున గరిష్టంగా తగ్గించుకునే అవకాశం ఉంది. సెక్షన్‌ 80జిజి కింద ఉన్న ఈ మినహాయింపులను ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంటుంది. రియా ల్టీరంగాన్ని మరింత ప్రోత్సహిం చేందుకు అటు బయ్యర్లు, విక్రే తలకు కూడా అనువైన విధానం రూపొందించాల్సి ఉందని రియా ల్టర్లు కోరుతున్నారు. మెట్రోనగ రాల వెంబడి పరిసరాల్లో మౌలిక వనరుల అభివృద్ధికి పెద్ద పీట వేయాలి. అందుబాటులో పక్కా గృహనిర్మాణ పథకానికి ముందు మౌలికవనరులు అభివృద్ధి చెందా ల్సి ఉంటుందని, 2022నాటికి పక్కాఇళ్లు లక్ష్యంనెరవేరాలంటే మౌలికవనరులు వృద్ధి చెందాలి. ప్రస్తుతం రియాల్టీరంగపరంగా రీట్‌ను ప్రకటించినా ఇప్పటివరకూ ఒక్క రీట్‌ కూడా జాబితా కాలేదు. ప్రస్తుతం ఉన్న డివిడెండ్‌ పంపిణీ పన్ను ఇందుకు కారణమని తెలుస్తోంది. వీటిపై ఉన్న సమస్యలను పరిష్కరిం చేందుకు ప్రభుత్వం కూడా చొరవచూపించాల్సి ఉంటుంది. అలాగే ఇ-కామర్స్‌రంగాన్ని రియాల్టీ రంగంలో ప్రోత్సహించాల్సి ఉంటుంది. జిఎస్‌టిపై మరింత స్పష్టత రావాల్సి ఉంటుందని డెవలపర్లు కోరుతున్నారు. జిఎస్‌టి అమలుకు ఆర్ధిక మంత్రి నిర్దిష్టమైన తేదీని ప్రకటించాలని కోరుతున్నారు. రవాణారంగ పరంగా జిఎస్‌టి అమలు ఎంతోకీలకం అవుతుందన్నది వారి వాదన. అలాగే ఇ-కామర్స్‌ వృద్ధి శరవేగంతో ఉందని, అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇ-కామర్స్‌కు విభిన్న నిర్వచనాలిస్తున్నాయని వాదిస్తున్నారు. కంపెనీలను ఇ-కామర్స్‌పైకి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని బిల్డర్లు, రియాల్టర్లు సూచించారు. ఇక రిటైల్‌ రంగాన్ని ప్రోత్సహించేందుకు మరికొన్ని వరాలు ప్రకటించాల్సి ఉంటుంది. సత్వరమే జిఎస్‌టి అమలుతోపాటు ఈకామర్స్‌, సాంప్రదాయక విక్రయాలకు సమాంతరంగా ఈకామర్స్‌ అమలు చేయాలని కోరుతున్నారు., రిటైల్‌రంగానికి వరాలు కురిపిస్తే దుబా§్‌ు, సింగపూర్‌ తరహాలో వృద్ధి ఉంటుందని, అంతేకాకుండా పర్యాటకులను కూడా మరింత ఆకర్షించేవీలుందని ఈ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద జైట్లీ బడ్జెట్‌పైనే ఎక్కువశాతం రియాల్టీరంగం ఆశలతో ఉంది.