ఫిబ్రవరి ఒకటినే పార్లమెంటుకు బడ్జెట్‌!

arun jaitly
arun jaitly

న్యూఢిల్లీ: ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ తాత్కాలిక బడ్జెట్‌ను 2019-20 ఆర్ధిక సంవత్సరానికిగాను ఫిబ్రవరి ఒకటవ తేదీనే పార్లమెంటులోప్రవేశపెట్టనున్నారు. ఆర్ధిక మంత్రిత్వశాఖ తాత్కాలిక బడ్జెట్‌ తయారీకి కసరత్తులను ఇప్పటికే ప్రారంభించిందని వెల్లడించారు. వివిద మంత్రిత్వశాఖలనుంచి ఇప్పటికే అన్ని గణాంకాలను సేకరించింది. బిజెపి ఆధ్వర్యంలోని ఎన్‌డిఎప్రభుత్వానికి రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఇదే చివరిబడ్జెట్‌ అవుతోంది. 2019-10 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి గతనెలలోనే ఆర్ధికశాఖ కసరత్తులు షురూచేసింది. ఉక్కు, విద్యుత్‌, హౌసింగ్‌ పట్టణాభివృద్ధి మరికొన్ని శాఖలతో సమావేశాలుజరిపింది. ప్రస్తుత ఆర్ధికసంవత్సరంలో సవరించిన వ్యయ అంచనాలు, ఆర్ధిక సంవత్సర కేటాయింపులు వంటివాటిపై చర్చలుజరిపింది. ఆర్ధికశాఖ ఈనెల 3వ తేదీనుంచి మీడియాపై ఆంక్షలు ప్రకటిస్తోంది. నార్త్‌బ్లాక్‌లో ప్రవేశించేందుకు వీలులేదు. ఆర్ధిక మంత్రిత్వశాఖ ఈ బ్లాక్‌లోనే ఉంది. తాత్కాలిక బడ్జెట్‌ పూర్తయ్యేంతవరకూ పార్లమెంటుప్రవేశపెట్టేంతవరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయి. జైట్లీ వరుసగా ఇది ఆరో బడ్జెట్‌ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రిగా నిలిచారు. సాంప్రదాయాలప్రకారం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ లేదా అత్యవసర ప్రభుత్వ ఖర్చులు పరిమితకాలానికి సంబంధించి పార్లమెంటు ఆమోదం తీసుకోవడం తప్పనిసరి. ఎన్నికల సంవత్సరంలో ఈవిధానం అనుసరిస్తారు. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి ఆర్ధిక బడ్జెట్‌ను కొత్త ప్రభుత్వంప్రవేశపెడుతుంది. నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని కొత్త ప్రభుత్వం బ్రిటిష్‌ కాలంనాటి సాంప్రదాయాలను తిరగరాసింది. మార్చిని కాదని, ఫిబ్రవరిలోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ముందస్తుకు మార్చగడం ద్వారా అన్నిమంత్రిత్వశాఖలు బడ్జెట్‌ గణాంకాలురూపొందించడంప్రారంభించాయి. ఏప్రిల్‌నుంచి ప్రారంబించే ఆర్ధిక సంవత్సరంలోనే మంత్రిత్వశాఖలకు కేంద్రం నిదులు పంపిణీచేస్తుంది. ఈ విధానం వల్ల ప్రభుత్వ శాఖలు మరింతగా నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం ఖర్చుచేసుకునేందుకు వీలవుతున్నది. అంతకుముందు బడ్జెట్‌ ఫిబ్రవరి చివరిలోవ్రేశపెట్టేవారు. మూడంచెల పార్లమెంటు ఆమోదం విధానం కొనసాగేది. మొత్తంమే మధ్యస్తం నాటికి అన్ని ఆమోదముద్రలు వేసుకునేది. దీనివల్ల ప్రభుత్వ శాఖలు ఆగస్టుచివరినుంచి లేదా సెప్టెంబరునుంచి వ్యయం చేయడం ప్రారంభిస్తాయి. రుతుపవనాల సీజన్‌ముగిసినప్పటినుంచి బడ్జెట్‌ నిదులు ఖర్చుచేసేందుకు వీలవుతుంది.