ప్లేస్టోర్‌లో క‌నిపించ‌ని ‘యూసీ బ్రౌజ‌ర్’

U C Browser
U C Browser

వాషింగ్టన్‌ : ప్ర‌ముఖ మొబైల్ యాప్ ‘యూసీ బ్రౌజర్‌’ గూగుల్‌ ప్లేస్టోర్‌లో కన్పించడం లేదు. యూసీ మొబైల్‌ బ్రౌజర్‌ 500 మిలియన్‌ డౌన్‌లోడ్లకు చేరుకున్న కొన్ని వారాల్లోనే ఇలా ఆ బ్రౌజర్‌ ప్లేస్టోర్‌ నుంచి మాయమవడం గమనార్హం. అయితే, యూసీ బ్రౌజర్‌ మినీ మాత్రం అందుబాటులో ఉంది.
యూసీ బ్రౌజర్‌పై గతంలో చాలా వివాదాలు వచ్చాయి. భారత వినియోగదారుల నుంచి ఇది సమాచారాన్ని తస్కరించి చైనా సర్వర్లకు చేరవేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ బ్రౌజర్‌పై భారత ప్రభుత్వం నిఘా కూడా పెట్టింది. మరో ఆరోపణ కూడా ఈ బ్రౌజర్‌పై ఉంది. బ్రౌజర్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేసినప్పటికీ.. లేక బ్రౌజింగ్‌ డేటా డిలీట్‌ చేసినప్పటికీ.. వాటిపై ఇంకా యూసీ బ్రౌజర్‌ నియంత్రణ పోవడం లేదని పలువురు ఆరోపించారు. ఆగస్టులో భారత ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖకు చెందిన ఓ అధికారి ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. యూసీ తప్పుచేసినట్లు తేలిచే దాన్ని భారత్‌లో నిషేధిస్తామని తెలిపారు.