ప్లాట్‌ మార్కెట్లో దుమ్మురేపుతున్న అడాగ్‌ షేర్లు

AMBANI BROTHERS
AMBANI BROTHERS

ముంబై: సెంటిమెంటును ప్రభావితం చేయగల అంశాలు కొరవడిన నేపథ్యంలో మార్కెట్లు మరీ ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. అయితే ఇలాంటి మందగమన మార్కెట్లోనూ అనిల్‌ ధీరూబా§్‌ు అంబానీ గ్రూడ్‌ (అడాగ్‌) కౌంట ర్లు మళ్లీ జోరందుకున్నాయి. అన్న ముఖేష్‌ అంబానీతో జత కట్టిన వార్తలతో ఇప్పటికే భారీర్యాలీ తీసిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ బాటలో ఇతర కౌంట ర్లూ లాభాల దుమ్ము రేపుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో పలు షేర్లు 25శాతం వరకూ ఎగశాయి. బిఎస్‌ఇలో అలాగే కంపెనీ రిలయన్స్‌ కేపిటల్‌ 5.2శాతం పెరిగి రూ.609వద్ద ట్రేడవుతోంది. మొదట రూ.612 వరకూ పురోగమించింది. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ దాదాపు 5శాతం జంప్‌చేసి రూ.580 వద్ద ట్రేడవుతోంది. మొదట రూ.583 వరకూ ఎగసింది. ఇక రిలయన్స్‌ పవర్‌ 25శాతం
దూసుకెళ్లి రూ.63వద్ద కదులుతోంది. రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ 10శాతం ఎగసి రూ.100 వద్ద ట్రేడవుతోంది. మొదట రూ.102 వరకూ పెరిగింది. ఈ బాటలో రిలయన్స్‌ నావల్‌ సైతం 25శాతం దూసుకెళ్లి రూ.62వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్‌ నిప్పన్‌లైఫ్‌ 2.3శాతం పెరిగి రూ.306వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 2.6శాతం పుంజు కుని రూ.37.2వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ నిప్పిన్‌లైఫ్‌ 52వారాల గరిష్టాలను తాకగా, గత నెల రోజుల్లో ఆర్‌కామ్‌ కౌంటర్‌ మూడు రెట్లు ఎగసింది. రూ.12.4నుంచి రూ.37కు దూసుకెళ్లింది. రిలయన్స్‌ జియో కు టవర్లు, స్పెక్ట్రమ్‌ విక్రయంతోపాటు మీడియా కన్వర్జెన్స్‌ నోడ్‌ ఆస్తుల అమ్మ కానికి ఒప్పందం కుదుర్చుకోవడం ఆర్‌కామ్‌ కౌంటర్‌కు ప్రోత్సాహాం ఇచ్చింది