ప్రొటినెక్స్‌ ప్రచారకర్తగా పృథ్విషా

prithvi shaw
prithvi shaw

న్యూఢిల్లీ: ఆరోగ్యపౌష్టికాహార ఉత్పత్తులు సంస్థ ప్రొటినెక్స్‌బ్రాండ్‌కు క్రికెట్‌ అండర్‌19 కెప్టెన్‌ ప్రృధ్వీషాతో ప్రచార ఒప్పందంచేసుకుంది. ఐదేళ్లపాటు కంపెనీకి చెందినప్రొటినెక్స్‌ ఉత్పత్తికి పృథ్వి ప్రచారంచేస్తారు. దనోన్‌ కంపెనీ ఈ ఉత్పత్తిని ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌ చేస్తోంది. కంపెనీ డైరెక్టర్‌ హిమాంశు బక్షిమాట్లాడుతూ ప్రొటినెక్స్‌ బ్రాండ్‌ ఎల్లవేళలా మంచి మార్కెట్‌ ఉంటుందని, భారత్‌లో తన మార్కెట్‌స్థాయి పెంచేందుకు యువ క్రీడాకారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉండేందుకు వీలుగా పృథ్విని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించి యువకుల్లో క్రీడాస్ఫూర్తిని పెంచామన్నారు. చిన్నపిల్లలనుంచి పెద్దలవరకూ ప్రొటినెక్స్‌ పటిష్టమైన బ్రాండ్‌గా నిలిచిందని ఈ సంస్థకు ప్రచారకర్తగా పనిచేయడం తనకు గర్వంగా ఉందని పృథ్విషా వెల్లడించారు. అంతర్జాతీయ ఉత్పత్తిగా నిలిచిన దనోన్‌ ప్రొటినెక్స్‌ భారత్‌ మార్కెట్‌ విస్తరణకు ఈ నియామకం చేసిందని అంచనా.