ప్రామాణిక కార్యాచరణతోనే విద్యుత్‌భద్రత పెంపు

An increase in activity with the electrical safety standard
ఐసిఎ సదస్సులో నిపుణుల వెల్లడి
హైదరాబాద్‌ : అంతర్జాతీయ కాపర్‌ అసోసియేషన్‌ విద్యుత్‌భద్రతపై జాతీయ ప్రమాణాలను విడుదలచేసింది. దేశంలో విద్యుత్‌ భద్రతకు సంబంధించి చర్చించేందుకు పరి శ్రమ నిపుణులు అందరూ ఒకేవేదికపైకి వచ్చారు. ఇంటర్నేషనల్‌ కాపర్‌ అసోసియేషన్‌ ఇండియా (ఐసిఎ)ఇందుకోసం దేశవ్యాప్తంగా సదస్సులు చర్చా గోష్టులు నిర్వహిస్తోంది. విద్యుత్‌భద్రత పరంగా నష్టాలను నివారించి ప్రమాదాలను తగ్గించి మరణాలు లేకుండా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయిం చింది. ఇందుకు పరిశ్రమ వృత్తి నిపుణుల్లో అవగాహన కూడా పెంచాలని సూచించారు. జాతీ య క్రైమ్‌ రికార్డుల బ్యూరో నివే దిక ప్రకారం 2014లో 11వేల మంది కేవలం విద్యుదాఘాతాల కారణంగా చనిపోయారు. ప్రతి రోజు 31మంది చనిపోతున్నట్లు తేలిందని నిపుణులు అందోళన వ్యక్తంచేశారు. విద్యుత్‌భద్రతకు అత్యధికప్రాధాన్యతనిస్తూ కేంద్ర ప్రభుత్వం అవ గాహణ కార్యక్రమాలను పెంచాలని నిర్ణయించింది. ఇందులోభాగంగానే జరిగిన సదసుసలో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభు త్వ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ జెపద్మా జనార్ధనరెడ్డి, తెలంగాణ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రమణప్రసాద్‌, ఆర్‌అండ్‌బి చీఫ్‌ ఇంజనీర్‌ ఎన్‌.కృష్ణారెడ్డి, ఇంటర్నేషనల్‌ కాపర్‌ అసోసి యేషన్‌ ఇండియా డైరెక్టర్‌ మన్స్‌కుందు తదిత రులు హాజరూ విద్యుత్‌భద్రతపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. రియాల్టీరంగం వృద్ధి, పట్టణీకరణ పెరుగుతున్న నేటితరుణంలో విద్యుత్‌ భద్రతపై అవగాహన కూడా పెంచాల్సిన అవసరం ఉందని పద్మా జనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నివాసభవనాలు, షాపింగ్‌మాల్స్‌, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి వాటిలో విద్యుత్‌ భద్రతాచర్యలు విధిగా పాటిం చాలని ఆయన సూచించారు. విద్యుత్‌ యంత్ర సామగ్రి అమర్చే సమయంలోనే భద్రతా ప్రమాణా లు పాటించాలని కోరారు. ఐసిఎ చీఫ్‌మేనేజర్‌ అమోల్‌ కల్సేకర్‌ మాట్లాడుతూ విద్యుత్‌ వ్యవ స్థలు ఏర్పాటు సమయంలోనే ప్రభుత్వ భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. క్రమాను గతంగా తనిఖీలు ఉండాలని, ఇళ్లకు నివాస సముదా యాలకు పదేళ్లు, వాణిజ్యభవనాలకు ఐదేళ్లకోసారి తనిఖీలు చేయాలని సూచించారు. ప్రమాదాల నివారణకు విద్యుత్‌ భద్రత సంరక్షణ ప్రమాణాలు పాటించాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని సూచించారు.