ప్రత్యక్షపన్నుల వసూళ్లు రూ.7.43 లక్షలకోట్లు

TAX
TAX

న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఏప్రిల్‌ డిసెంబరునెలల మధ్యకాలంలో గత ఏడాది 13.6శాతం పెరిగినట్లు ఆర్ధికశాఖ వెల్లడించింది. గత ఏడాది తొమ్మిదినెలలకాలంలో 7.43లక్షలకోట్ల పన్నులువసూలయ్యాయని అంచనా. మొత్తం బడ్జెట్‌ అంచనాల్లో 64.7శాతం లక్ష్యాలు సాధించినట్లు వెల్లడించింది. 2018-19 ఆర్ధికసంవత్సరానికి పన్నువసూళ్లు 11.50 లక్షలకోట్లుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. స్థూలంగా డిసెంబరు చివరివరకూ రూ.8.74 లక్షలకోట్లుగా ఉంది. 14.1శాతం పెరిగింది. ఇక రీఫండ్స్‌కకూడా 1.30 లక్షలకోట్లుగా ఉన్నట్లు సిబిడిటి వెల్లడించింది. అంతకుముందు సంవత్సరం కంటే 17శాతం ఎక్కువ ఉన్నట్లు అంచనా. ఇక కార్పొరేట్‌ ఆదాయపు పన్ను వసూళ్లు 14.8శాతంపెరిగాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను సెక్యూరిటీల లావాదేవీలపన్నుతోసహా చూస్తే మొత్తం తొమ్మిదినెలల కాలంలో 17.2శాతం పెరిగింది. ఇక రీఫండ్స్‌ సర్దుబాట్లు తర్వాత నికరంగా కార్పొరేట్‌ పన్ను వసూళ్లు 16శాతం పెరిగాయి. ఇక వ్యక్తిగత ఆదాయపు పన్నువసూళ్లు 14.8శాతంపెరిగినట్లు వెల్లడించారు. అంతకు ముందు 2017-18 ఆర్ధికసంవత్సరంలో స్వచ్ఛంద ఆదాయ వెల్లడిపథకం కింద 2016నుంచి చూస్తే 10,844కోట్లుమూడోవిడత చివరి వాయిదా కింద వసూలయిందని, ప్రస్తుత రాబడుల్లో వీటిని కలపలేదని ఐటిశాఖ వెల్లడించింది. అడ్వాన్సు పన్నురూపంలో ఇప్పటివరకూ 3.64 లక్షలకోట్లు వసూలుచేసింది. అంతకుముందు సంవత్సరంతోపోలిస్తే 14.5శాతంగా నిలిచింది. అడ్వాన్సుపనున్న 23.8శాతంగా ఉందని ఐటిశాఖ వివరించింది.