ప్యాసింజర్‌కార్ల మార్కెట్లో మారుతి టాప్‌!

Maruti
Maruti

ప్యాసింజర్‌ కార్ల మార్కెట్లో మారుతి టాప్‌!

ముంబయి: మారుతిసుజుకి భారతీయ ప్యాసింజర్‌ కార్ల మార్కెట్‌లో తన పట్టును నిలుపుకుం టున్నది. మొత్తం ఏడుమోడళ్లు భారత్‌ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో అగ్రశ్రేణి మార్కెట్లతో నడుస్తున్నట్లు అంచనా. సియామ్‌ అంచనాలను చూస్తే మారుతిసుజుకి ఆరు మోడళ్లు టాప్‌టెన్‌ జాబితాలో ఉంచింది. ఈ ఏడాది ఏడు మోడళ్లు చోటుచేసుకున్నాయి. ప్యాసింజర్‌ వాహన మార్కెట్‌లో 30,48,277 వాహ నాలను విక్రయిస్తే అంతకుముందు ఏడాది 27,89,208 వాహనాలను విక్రయించింది. 9.23శాతం వృద్ధిని నమోదుచేసింది. మారుతిసుజుకి టాప్‌ ఏడు మోడళ్లు మొత్తం వాహనాల్లో 35శాతం వాటాతో ఉన్నాయి. 10,74,937 యూనిట్లుగా ఉన్నట్లు అంచనా.

మొత్తంగాచూస్తే కంపెనీ 14,43,641 యూనిట్లను విక్ర యించింది. గత ఏడాది 47.38శాతం ప్యాసింజర్‌ వాహ నాల్లో మార్కెట్‌ వాటాను కొనసాగించింది. మారుతి ఆల్టో టాప్‌ గేర్‌లో నిలిచింది. 8.27శాతం క్షీణించినా టాప్‌ స్థాయి లో అదేమోడల్‌ నిలిచింది. 2,41,635 యూనిట్లు విక్రయిం చింది. గతఏడాది స్వల్పంగా అంటే 2,63,422 యూనిట్ల ను సాధించింది. వ్యాగన్‌ ఆర్‌ రెండోస్థానంలో ఉంది. 1,69,555 యూనిట్ల నుంచి 1,72,346 యూనిట్లకు పెరిగాయి. కంపెనీ నుంచి డిజైన్‌ కంపాక్ట్‌సెడాన్‌ మూడోస్థానంలో ఉంది. 1,95,939 యూనిట్ల నుంచి 1,67,266 యూనిట్లు మాత్రమే విక్రయించినా ఎక్కువమంది కోరుకున్నట్లు అంచనా. ఇక నాలుగో స్థానంలో మారుతిస్విఫ్ట్‌ 1,66,985 యూనిట్లతో నిలిచింది. పోటీ కంపెనీ హుండైమోటార్‌ ఇండియా సంస్థ చిన్నకారు గ్రాంట్‌ ఐ10 ఐదో ఉత్తమ విక్రేతగా నిలిచింది. 1,46,228 యూనిట్లను విక్రయిం చింది. ఎలైట్‌ ఐ20 ఆరోస్థానంలో 1,26,304 యూనిట్లను విక్రయించింది. మారుతి ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్‌ బాలెనో ఏడోస్థానంలో ఉంది. 1,20,284 యూనిట్లు విక్రయిస్తే రీనాల్ట్‌ ఇండియా ఎంట్రీలెవల్‌ చిన్నకారు క్విడ్‌ ఎనిమిదోస్థానంలో 1,09,341 యూనిట్లు విక్రయించింది. ఇక మారుతికి చెందిన ఎస్‌యువి విటారా బ్రెజా తొమ్మిదోస్థానంలో ఉంది. 1,08,640 యూనిట్లు విక్రయించింది. మరో కంపాక్ట్‌కారు సెలెరియో పదోస్థానంలో నిలిచింది. 97,361 యూనిట్లు విక్రయించినట్లు సమాచారం.