పేటీఎం యాప్ పై ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు

Paytm
Paytm

పేటీఎం వినియోగదారులు తమ పేటీఎం యాప్ పైనే తమకు నచ్చిన రెస్టారెంట్ల నుండి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ నూతన సేవలు ప్రస్తుతం ఢిల్లీ ఎన్.సీ.ఆర్ లోని ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో వున్నాయి.  పేటీఎం ఐఓఎస్ యాప్ వినియోగదారులతో పాటు దేశవ్యాప్తంగా ఇతర వినియోగదారులకు త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ తెలిపింది. టైర్ 2, టైర్ 3 పట్టణాలలో ఆన్ లైన్ ఫుడ్ ఆర్డరింగ్ పెరుగుదలే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. కాగా, ‘జోమాటో’లో 100 నగరాలలో 80 వేలకు పైగా రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నాయి.పేటీఎం ఆన్ లైన్ ఫుడ్ ఆర్డరింగ్, డెలివరీ కోసం ‘జోమాటో’తో జతకట్టినట్టు ప్రకటించింది.