పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు

dollar
dollar

పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు

ముంబై, అక్టోబరు 22: భారతదేశ విదేశీద్రవ్య నిల్వలు (ఫారెక్స్‌) అక్టోబరు 13వ తేదీనాటికి 1.50బిలియన్‌ డాలర్లమేరకు పెరిగినట్లు అధి కార గణాంకాలను బట్టి తెలుస్తోంది. రిజర్వు బ్యాంకు శుక్రవారం విడుదలచేసిన వీక్లీ గణాం కాల నివేదికను బట్టి విదేశీ ద్రవ్య నిల్వలు అక్టోబరు 6వతేదీతో ముగిసిన వారంలో ఉన్న 398.79 బిలియన్‌డాలర్ల నుండి 400.29 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. విదేశీ ద్రవ్య నిల్వలు అంటే విదేశీ కరెన్సీ ఆస్తులతో పాటు బంగారంనిల్వలు, స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డి ఆర్‌), అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) వద్ద ఆర్‌బిఐ పొజిషన్‌ కలిసి ఉంటాయి. ఇక ఫారెక్స్‌ నిల్వల్లో అత్యధిక భాగంగా ఉండే విదేశీ కరెన్సీ ఆస్తులు ఈ వారంలో 1.47 బిలియన్‌ డాలర్లు పెరిగి 375.27బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. బంగారం నిల్వల విలువ స్థిరంగా 21.24బిలియన్‌ డాలర్లు గా ఉండగా, ఎస్‌డిఆర్‌ల విలువ 9.5మిలియన్‌ డాలర్లు పెరిగి 1.50బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.