పారిశ్రామికరంగానికి మోడీ బూస్ట్‌!

industrial sector
industrial sector

ఎన్నికల ముందే అమలుకు కసరత్తు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశంలోని పారిశ్రామికరంగానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తూ కొత్త విధానాలను ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్ణయించారు. దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సమించి తద్వారా ఆర్ధికవృద్దిని పెంచాలనినిర్ణయించారు. కొత్త ప్రణాళికలో కొత్తగా ఏర్పాటుచేయదలిచిన కంపెనీ స్థలం కొనుగోలుచేయాల్సిన అవసరం లేదు. యంత్రసామగ్రి అవసరం లేదు. అయితే వాటిని దీర్ఘకాలిక కాంట్రాక్టుపద్దతిన తక్కువదరలకే లీజుకు తీసుకోవచ్చు. దీనివల్ల కాలపరిమితి తగ్గుతుంది. కార్యకలాపాలు సత్వరమేప్రారంభించే అవకాశం ఉందని దీపక్‌ కార్యదర్శి రమేష్‌ అభిషేక్వఎల్లడించారు. పారిశ్రామిక క్లస్టర్లలో ఉన్న యూనిట్లకు మాత్రమే ఈ సదుపాయాలు అమలవుతాయి. వీటితోపాటు ఇతర మౌలికవసతులు కూడా ఒనగూరుతాయి. ఇతర సంస్థలకు, ఇతర దేశాలకు గట్టిపోటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తమ మంత్రిత్వశాఖ ఇదే ప్రణాళికపై ఏడాదికాలంగా కసరత్తులుచేస్తోందని దీపమ్‌ కార్యదర్శి చెప్పారు. పారిశ్రామిక ఉత్పత్తి ప్రోత్సాహకమండలి (దీపమ్‌) ఆధ్వర్యంలో ఈప్రణాళికకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఏడాదికి పది మిలియన్ల మందికి ఉపాధి కల్పించాలన్న ప్రధాన లక్ష్యం చేరుకోవాలంటే ముందు ఉత్పత్తిరంగం పటిష్టం కావాలన్న యోచన ఉంది. 2019 మేనెలకల్లా దేశం సార్వంత్రిక ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఈలోపే ప్రతిపక్షాలు ఎన్‌డిఎ ప్రభుత్వంపై ఉపాధిహామీ గాలికొదిలేసిందన్న విమర్శలు సైతం పెంచుతున్నాయి. దీనికితోడు భారత్‌కు విదేశీ ప్రత్యక్షపెట్టుబడులుసైతం పెరుగుతున్నాయి. ఈఏడాదిజూన్‌ త్రైమాసికం నాటికి 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అందాయి. ఎన్నికల్లో ప్రధానిమోడీ మళ్లీ ఎన్నికైనపక్షంలో దేశానికి 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయని అంచనా. త్రైమాసిక వృద్ధి ఈ సారి కొంత మందగమనంతో ఉంది. సెప్టెంబరుత్రైమాసికంలో కూడా ఇదే తీరుకనిపిస్తోంది. బ్యాంకుల్లో నెలకొన్న నగదు సమస్య కొంత బిజినెస్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. ఇందుకుగాను చిన్న మధ్యతరహా సంస్థలకు నిబంధనలు సడలించింది. ఆసియాలోని మూడో అతిపెద్ద ఆర్ధికవ్యవస్థ ఉన్న భారత్‌లో రుణపరపతిని సడలిస్తే బిజినెస్‌ వృద్ధి ఉంటుందన్నది అంచనా. దేశం ఇప్పటికే 23స్థానాలను అధిగమించి బిజినెస్‌ సానుకూలతలో 77వ స్థానానికి పెరిగింది. ప్రభుత్వం కూడా 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో కూడిన ఢిల్లీ ముంబయి పారిశ్రామిక కారిడార్‌ను పూర్తిచేస్తోంది. ఇప్పటికే దశాబ్దకాలంగా ఈ కారిడార్‌ జాప్యం జరిగింది. రెండు వందలకోట్ల డాలర్ల విలువైన ప్రాజెక్టులు కంపెనీలద్వారానే వస్తున్నాయి. కారిడార్‌లలోనే కంపెనీలు పలు ఏర్పాట్లకు అనుమతులు రావడంతో కొంతమేర ప్రాజెక్టు సత్వరమే పూర్తికావస్తోందని అంచనా.