పాన్‌-ఆధార్‌ లింక్‌ గడువు పెంచేందుకు రెడీ

aadhar-pan link
aadhar-pan link

న్యూఢిల్లీ: ఆధార్‌ తప్పనిసరి చేయడానికి సుప్రీంకోర్టుగనుక అంగీకరిస్తే పాన్‌-ఆధార్‌ అనుసంధానం గడువును పెంచడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ అధికారులు తెలిపారు.పాన్‌-ఆధార్‌ అనుసంధానంకోసం అవసరమైతే మూడునుంచి ఆరు నెలల పాటు అదనపు గడువు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. ప్రస్తుతం పాన్‌-ఆధార్‌ అనుసంధానానికి ఆదాయం పన్ను శాఖ డిసెంబర్‌ 30 వరకు గడువు ఇచ్చింది.ఈ గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుండడంతో మరోసారి గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.దేశంలో 35 కోట్ల మంది పాన్‌కార్డులున్న వారుండగా నవంబర్‌ వరకు 13.28 కోట్ల మంది పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. నకిలీ పాన్‌ కార్డులను నిరోధించేందుకే ఈ ఆధార్‌ అనుపంధానాన్ని తీసుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఒక వేళ నిర్ణీత గడువు లోగా ఆధార్‌ అనుసంధానం చేసుకోకపోతే పాన్‌ను రద్దు చేయనున్నారు.నకిలీ పాన్‌ కార్డులు దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరం. వాటితో బ్యాంకు ఖాతాలు తెరిచి లావాదేవీలు జరుపుతున్నారు. దీన్ని నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకొంటున్నాం అని అధికారులు వెల్లడించారు.