పాన్‌కార్డులున్నా ఐటిరిటర్నుల్లేవ్‌!

INCOME TAX
INCOME TAX

పాన్‌కార్డులున్నా ఐటి రిటర్నుల్లేవ్‌!

న్యూఢిల్లీ, జూలై 27: దేశవ్యాప్తంగా 6.83 లక్షల కంపెనీలకు పాన్‌కార్డులు ఉన్న ప్పటికీ ఆ కంపెనీలు ఇప్పటివరకూ ఆదాయపు పన్నురిటర్నులు దాఖలు చేయడంలేదు. 2016-17 అసెస్‌మెంట్‌ సంవత్సరంలో ఈ కంపెనీలు రిటర్నులు దాఖలుచేయలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్‌గాంగ్వార్‌ పార్లమెంటుకు నివేదించారు. పాన్‌కార్డులు ఉండి సక్రమంగా ఐటి రిటర్నులు దాఖలు చేయని సంస్థలు రోజురోజుకూ పెరిగుతున్నాయి. గడచిన ఐదేళ్లుగా ఈ సంఖ్య మరింతగా పెరుగుతున్నా యి. 2012-13 అసెస్‌మెంట్‌ సంవత్సరంలో 4.09లక్షలుగా ఉన్నాయి. 2013-14 సంవత్సరంలో 4.60లక్షలకు పెరిగాయని గాంగ్వార్‌ రాజ్యసభలో వెల్లడించారు. అలాగే 2014-15అసెస్‌మెంట్‌ సంవ త్సరంలో 5.19 లక్షలుగా ఉన్న ఈ సంఖ్య 2015-16 సంవత్సరంలో 5.73 లక్షలకు చేరింది. చివరికి గత ఆర్థికసంవత్సరం అంటే అసెస్‌ మెంట్‌ సంవత్సరంలో 6.83లక్షలు గా ఉన్నట్లు తేలింది. ఆదాయపు పన్నుశాఖ అంచనాలను బట్టిచూస్తే ఢిల్లీపరంగా ఇలాంటికేసులు ఎక్కువ ఉన్నాయి. 1.44లక్షలవరకూ ఉన్నట్లు అంచనా.ఆతర్వాత స్థానంలో ముంబై 94,155వరకూఉన్నాయి. పాన్‌కార్డు లు ఉన్నా వీరంతారిటర్నులు దాఖలు చేయడంలేదనితేలింది. ప్రాంతాలవారీగాచూస్తే తమిళనాడు 63,567కంపెనీలు రిటర్నులు దాఖలుచేయడం లేదు. తర్వాత పశ్చిమబెంగాల్‌, సిక్కిమ్‌రీజియన్‌ 60,983 వరకూ ఐటి రిటర్నులు దాఖలు చేయడంలేదు.