పాన్‌కార్డులపై పరిమితి రూ.5లక్షలకుపెంచాలి

cash
cash

పాన్‌కార్డులపై పరిమితి రూ.5లక్షలకు పెంచాలి

జిజెఎఫ్‌ ఆర్థిక మంత్రికి వినతి

ముంబై, జనవరి 25: దేశీయంగా ఉన్న జ్యుయెలర్లు సంఘాలు ఆభరణాల కొనుగోళ్లపై పాన్‌ కార్డు నిబంధన పరిమితిని ఐదులక్షలకు పెంచాలని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి విజ్ఞప్తిచేసాయి. అలాగే బంగా రంపై దిగుమతిసుంకాన్ని కనీసం ఐదుశాతంకు తగ్గించాలని కోరారు. అఖిలభారత జెమ్స్‌ అండ్‌ జ్యూయెలరీ ట్రేడ్‌ ఫెడరేషన్‌ జిజెఎఫ్‌ ప్రధానంగా సుంకాలు, పాన్‌కార్డు నిబంధనలపైనే ప్రతిపాదనలు అందచేసింది. ప్రస్తుతం రెండులక్షల పరిమితి పాన ్‌కార్డుపై ఉంది. దీనివల్ల తీవ్రస్థాయిలో సవాళ్లు ఎదు రవుతున్నాయని, సంఘటితరంగంలో ఉన్న జ్యుయె లరీ పరిశ్రమ గడచిన దశాబ్దకాలంగాచూస్తే రెండు శాతం చొప్పున పెరుగుతున్నదని దీనికి మద్దతుగా ప్రభుత్వం కూడా పాన్‌కార్డు నిబంధనను ఐదు లక్షలు ఆపైకి పెంచాలని ఛైర్మన్‌ నితిన్‌ ఖండేల్‌వాల్‌ వెల్లడించారు. ప్రస్తుత దిగుమతిసుంకాన్ని పది నుంచి ఐదువాతానికి తగ్గించాలని సూచించారు. అలాగే జిఎస్‌టిని 1.25శాతంగా ఈరంగానికి పరి మితంచేయాలని, దేశం మొత్తం ఒకే పన్ను వ్యవస్థ కిందికి వస్తున్నందున జిఎస్‌టిని ఆభరణాలు రంగం పై 1.25శాతానికి పరిమితంచేయాలని కోరారు. ప్రధాని ప్రారంభించిన అశోకచక్ర నాణేలు జ్యుయె లర్లు విక్రయించేందుకు అనుమతించాలని దీనివల్ల మరింత గా అమ్మకాలు పెరుగుతాయన్నారు. వజ్రా భరణాల రంగంలోని సమస్యలు పరిష్కరించేందుకు పరిశీలిం చేందుకు ఒక ప్రత్యేక మండలిని ఏర్పాటు చేయాలని జిజెఎఫ్‌కోరింది. అవకతవకలు జరగకుండా ఉండేం దుకుగాను ముడిబంగారం దిగుమతులపై కఠినఆంక్షలు అమలుచేయాలనికోరారు. అధీకృతఏజెన్సీలు, బ్యాంకు లకు మాత్రమే దిగుమతులకు అనుమతులున్నాయి. మరిన్నిఏజెన్సీలకు అనుమతులివ్వాలని దీనివల్ల మరిం తగా అందుబాటులోనికి పసిడి వస్తుందని ఖండేల్‌వాల్‌ వెల్లడించారు. అంతేకాకుండా హాల్‌ మార్కింగ్‌ తప్పని సరిచేయడాన్ని స్వాగతించింది. ఇందుకు మరికొన్ని కేంద్రాలను పెంచాలని కోరారు. మొత్తం మూడులక్షల మందికిపైగా వ్యాపారులు, ఉత్పత్తిదారులు, టోకు వర్తకులు, రిటైలర్లు, పంపిణీదారులు, లేబొరేట రీలు, జెమాలజిస్టులు, డిజైనర్లు ఉన్న ఈ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరారు.