పర్యాటక రంగానికి మధ్యప్రదేశ్‌ కేంద్రం

MP
ఎండి శ్రీకాంత్‌

 

పర్యాటక రంగానికి మధ్యప్రదేశ్‌ కేంద్రం

హైదరాబాద్‌, ఆగస్టు 24: పర్యాటక రంగపరంగా మధ్యప్రదేశ్‌కు ఏటేటా మరింతగా యాత్రీకులు సందర్శనకు వస్తున్నారని ఐఎఎస్‌ అధికారి మధ్యప్రదేశ్‌ పర్యాటక మండలి అదనపు ఎండి శ్రీకాంత్‌ పాండే వెల్లడించారు హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించిన పర్యాటక మండలి వన్యప్రాణులు, తీర్ధయాత్రలు, వారసత్వం, ఆహ్లాదం వంటి పర్యాటక ప్రాంతాలు ఎంతో ఆకర్షసిస్తాయని ఆయన అన్నారు. బహుళ సంస్కృతులు, పలు మతాల జీవనశైలిలకు మధ్యప్రదేశ్‌ప్రాతి నిధ్యం వహిస్తుందని, ఈ బహుళ తత్వం ఈప్రాంతానికి గర్వకారణమని అన్నారు. జల్‌మహోత్సవ్‌, సాహిత్య, సంగీత వేడుకలు, ఇతరఎన్నో ఆకర్షణలకు తోడుగా రోడ్‌షో లు పర్యాటకరంగానికి పటిష్టమైన పునాదులు వేసాయ న్నారు. సాల్‌ వృక్షాలు, వెదురు పొదలతో 77,7-00 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉండటంతో పాటు తొమ్మిది జాతీయ పార్క్‌లు సాత్సురా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, నేషనల్‌ చంబల్‌ గడియల్‌ శాంచురీ లాంటి 25వ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలతో ఖజురహో, భిమ్‌బెట్కా, సాంచి వంటి మూడు యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాలతో మధ్యప్రదేశ్‌ ఎవరికైనా ఎన్నో అద్భు తాలు అందిస్తుందని అన్నారు. గ్వాలియర్‌,మండు లాంటి అందమైన పురావస్తు స్థలాలు, ఇంద్రాసాగర్‌, గాంధీ సాగర్‌, తవ బార్గిలాంటి జలాశయాలు మరెన్నో సాంప్రదాయఉత్సవ్‌లు పర్యాటకులకుమరింత స్ఫూర్తినిస్తాయన్నారు. పెట్టుబడులకు కూడా మధ్యప్రదేశ్‌ అకర్ణణీయ గమ్యస్థానంగా నిలిచిందన్నారు. భోపాల్‌ల అక్టోబరు 27-29వ తేదీవరకూ జరిగే ట్రావెల్‌ మార్ట్‌, ఇందిరాసాగర్‌ డామ్‌ వద్ద అక్టోబరు 15-జనవరి రెండవ తేదీవరకూ జరిగే జల్‌మహోత్సవ్‌లు ముఖ్యమైనవని అన్నారు. మండలి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఓంవిజ§్‌ుచౌదరి మాట్లాడుతూ విభిన్న సంస్కృ తుల మేలుకలయిక మధ్యప్రదేశ్‌ అని ప్రతిఒక్కరూ సందర్శించాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయన్నారు.