పప్పుదినుసుల మార్కెట్‌లో శెనగపప్పుకు మెగా డిమాండ్‌!

daldladal
దిగుమతి నిల్వలు కరిగిపోవడమే ధరల పెరుగుదలకు కారణం
బెంగళూరు : పప్పు దినుసుల మార్కెట్‌లో అన్ని రకాల పప్పులకంటే ముందు చనా అంటే పుట్నాల పప్పుదినుసులు కందిపప్పుకంటే ధరలు పెరిగాయి. కరిగిపోత్ను నిల్వలు, పెరుగుతున్నడిమాండ్‌తో ధరలు గతకొన్ని వారాలుగా భారీ మొత్తంలోపెరిగాయి. ఖరీఫ్‌ ఆయ కట్టులో మంచి దిగుబడులు వస్తాయని కొత్త పంట మార్కెట్లకురాగానే ధరలు కొంతమేర తగ్గుతాయి అంచనా. శెనగ, కంది పప్పులు మార్కెట్‌లో ఇటీ వల భారీఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. దేశంలోని కీలకమార్కెట్లు ఇండోర్‌, ఢిల్లీ మార్కెట్లలో శెనగపప్పు కందిపప్పును మించి ధరలు కొనసాగు తున్నాయి. ఢిల్లీకి చెందిన పప్పుదినుసులు, బీన్స్‌ దిగుమతి దారుల సంఘం అధ్యక్షుడు ప్రదీప్‌కుమార్‌ జిందాల్‌ మాట్లాడుతూ కమోడిటీ ట్రేడింగ్‌ చరిత్ర లోనే ఈ రెండు రకాల పప్పుదినుసులు గరిష్టంగా పెరిగాయని, ఇటీవలికాలంలో శెనగపప్పుకు మంచి ధర పలికిందన్నారు. ఎన్‌సిడెక్స్‌లో  శెనగల కాం ట్రాక్టు జూలై20వ తేదీతో ముగిసింది. నాలుగూతం పెరిగి క్వింటాలుకు 9020గా కొనసాగింది. ఆగస్టు నెల కాంట్రాక్టు కూడా నాలుగు శాతం పెరిగి 8788 గా ఉంది. భవిష్యత్తు ధరలు కూడా ఇదేవిధంగా ఉంటాయని అంచనా. మార్కెట్‌పర్యవేక్షణ సంస్థ సెబిమాత్రం కొత్త శెనగపప్పు కాంట్ట్రును ఫ్యూచర్స్‌ లో నిషేధించింది. గుజరాత్‌లోని దాహోద్‌లో మోడల్‌ప్రైస్‌ కందిపప్పుకు క్వింటాలుకు 7500గా నిలిచింది. అలాగే శెనగలు 8650గా నడిచింది. స్పాట్‌ మార్కెట్లలో ఢిల్లీలో శెనగ ధరలు 9028గా నడిచాయి. ఇండోర్‌ మార్కెట్‌లో 8593రూపాయ లుగా క్వింటాలుధరలున్నాయి. ఇక శెనగ పప్పు ధరలపరంగా చూస్తే చనాదాల్‌ క్వింటాలు సగటున 10,500 నుంచి 10,700వరకూ నడిచింది. ముత కరకం పప్పు అయితే 11వేలనుంచి 11,200 వర కూ ఇండోర్‌మార్కెట్లలో ధరలుపలికాయి. ఇక ప్రతి కూల వాతావరణం కూడా దేశీయంగా శెనగపంటను కొంత దెబ్బతీసింది. గతఏడాది 7.33 మిలియన్‌ టన్నులు దిగుబడి ఉంటే ఈ ఏడాది కేవలం 5.5 మిలియన్‌టన్నులు మాత్రమే ఉంది. వీటికితోడు ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న నిల్వలు కరిగిపోతున్నాయి. 4-5లక్షల టన్నులు దిగుమతి చేసుకుం టున్న భారత్‌లో కృ త్రిమ కొరతవల్లనే ధరలు పెరుగుతున్నట్లు అం చనా. ఆస్ట్రేలియా దిగుమతులు పెరిగినా, కొత్త పంట మార్కెట్లకు వచ్చినా ధరలు తగ్గుతాయని అంచనా. అక్టోబరునెలలో 1.3మిలియన్‌టన్నుల పంట వస్తుంది. వచ్చే రెండు నెలలకు ఈ కొత్త పంట రావచ్చని అంచనా. ఆస్ట్రేలియా నుంచి కూడా సెప్టెంబరు అక్టోబరు నెలల్లో దిగుమతులు అవుతాయి. దీనివల్ల క్వింటాలుధరలు రూ.8500 నుంచి 9000 గా కొనసాగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. దిగుమతి పప్పులు స్థానిక మండిలకు చేరితే చనా దాల్‌ ధరలు 1000 నుంచి 1500 వరకూ క్వింటాలుకు తగ్గుతాయని వర్తకులు చెపుతున్నారు. అలాగే కందిపప్పు కూడా క్రమేపీ పెరుగుతోంది. దిగుమతి నిల్వలు కరిగిపోవడంతో డిమాండ్‌ పెరుగుతూ క్వింటాలు 8500 నుంచి 9000కు పెరిగినట్లు తేలింది. మొజాంబిక్‌ నుంచి వచ్చే దిగుమతులు అక్టోబరు నవంబరునెలల్లో ఉంటాయి. తదనంతరం దేశీయ మార్కెట్లలో ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణుల అంచనా. గడచిన శుక్రవారం వరకూ కంది ఆయకట్టు 29.19 లక్షల హెక్టార్లుగా ఉంది. గత ఏడాది 18.62లక్షల హెక్టార్లతో పోలిస్తే తక్కు వగా ఉంది. మంచి దిగుబడులు, ఆయకట్టు పెరగ డంతో కొంత పప్పునిల్వలు కూడా పెరుగుతాయని అంచనా. కర్ణాటకలోని గుల్బర్గాలో ఎక్కువ మొత్తం సాగవుతుంది. కందిపప్పు మహారాష్ట్రలో క్వింటాలు పదివేల రూపాయలుగా ఉంది. రిటెల్‌ మార్కెట్‌లో రూ.210గా నమోదయింది. కంది పప్పు ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టినా డిమాండ్‌ పెరుగుతూనేఉంది. ప్రస్తుతం క్వింటాలు ధరలు 13వేల నుంచి 14వేల వరకూ ఇండోర్‌ మార్కెట్లలో ధరలు పలుకుతున్నాయి. పప్పుదిను సులు, పప్పుగింజల ధరలు ఏప్రిల్‌లో పెరగడంతో కంఏద్ర ప్రభుత్వం నిల్వల పరిమితులను విధిం చింది. మిల్లులస్థాయిలో శుద్ధి వ్యయం పెరుగుతుం డటంతో కందిపప్పు సహజంగానే 25-30శాతం రిటైల్‌ మార్కెట్‌లో ఎక్కువ ధరలు పలుకుతున్నది.