పతనమవుతున్న పసిడి

DOLLER
DOLLER

పతనమవుతున్న పసిడి

న్యూఢిల్లీ, అక్టోబరు 10: అమెరికా సెంట్రల్‌ బ్యాంకు- ఫెడ్‌ తన ఫండ్స్‌ రేటును పెంచడం ఖాయమన్న అంచనాల నేపథ్యంలో పసిడి పడిపోవడం జరుగు తోంది. న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌- నైమెక్స్‌లో బంగారం ఔన్స్‌ (31.1గ్రా) ధర అక్టోబరు 6వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 7డాలర్లు నష్టపోయింది. 1,279 డాలర్ల వద్ద ముగిసింది. పసిడి తగ్గుతూ రావడం వరుసగా ఇది నాల్గవ వారం. ఈ నాలుగు వారాల్లో దాదాపు 100 డాలర్ల నష్టాన్ని చూసింది.

శుక్రవారం ఒకదశ లో డాలర్‌ ఇండెక్‌్‌స 94.09ని చూసిన పరిస్థితుల్లో పసిడి 1,264 డాలర్లకు పడిపోయింది. ఇండెక్స్‌ను 93.62 వద్దకు పడగొట్టగా, అదే సమయంలో బంగారం తిరిగి 1,279 డాలర్లకు దూసుకుపోయిం ది. అమెరికా ఆర్థిక పరిస్థితులు డాలర్‌ను మున్ముం దు నిర్దేశిస్తాయని, ఆయా అంశాలే పసిడికి భవిష్య త్తును చూపిస్తాయని నిపుణుల అంచనా. పసిడికి తక్షణ మద్దతు 1,250 డాలర్లను కిందకు పడితే 1,212 డాలర్లను చూస్తుందని టెక్నికల్‌ అనలిస్టులు పేర్కొంటున్నారు.

1,210స్థాయిలో పసిడి కొనుగో లు అవకాశమనివారు అంటున్నారు. రేట్లపెంపు అంచ నా మొత్తం మీద సమీపకాలంలో ఎల్లో మెటల్‌కు ప్రతికూలంగా, డాలర్‌ ఇండెక్స్‌కు అనుకూలంగా మారే వీలుందని భావిస్తున్నారు. ఫెడ్‌ఫండ్‌ రేటు (అమెరికా సెంట్రల్‌బ్యాంకు రేటు ప్రస్తుతం 1-1.25 శాతం శ్రేణి) ఈఏడాది ఒకసారి, వచ్చే ఏడాది మూడుస్లార్లు పెంపు తథ్యమని అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంకు సంకేతాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీర్ఘ కాలంలో అమెరికా ఆర్థిక అనిశ్చితి ధోరణి, ఉత్తర కొరియాతో ఘర్షణాత్మకపరిస్థితి వంటిఅంశాలు -పసిడి బులిష్‌ ట్రెండ్‌ను కొనసాగిస్తుందని భావిస్తున్నారు.

దేశంలో అంతర్జాతీయ ప్రభావం

అంతర్జాతీయంగా పసిడి స్పీడ్‌కు బ్రేకులు పడిన వైనం భారత్‌లోనూ తన ప్రభావాన్ని కొనసాగిం చింది. డాలర్‌ మారకంలోరూపాయి బలహీనత ఈ ధోరణి యధాతథానికి కారణమయ్యింది. దేశీ యంగా ఫ్యూచర్స్‌మార్కెట్‌-మల్టీ కమోడిటీ ఎక్ఛ్సేం జ్‌లో పసిడి ధర దాదాపు రూ.300తగ్గి రూ.29,573 వద్ద ముగిసింది. ముంబై ప్రధాన స్పాట్‌ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాము లకు వారం వారీగా రూ.335 తగ్గి రూ.29,510 కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర సైతం అదే స్థాయిలో తగ్గి రూ.29,360కి చేరింది. ఇక వెండి కేజీ ధర రూ.560 తగ్గి రూ.38.850కి చేరింది.