పటిష్టపడిన డాలర్‌

Dollars, Rs
Dollars, Rs

పటిష్ట పడిన డాలర్‌

ముంబై: ఆసియా యూరోప్‌దేశాల కరెన్సీ మారకం విలువలు ఈ వారంలో స్వల్పమార్పులు చోటు చేసుకుంటున్నాయి. వారం ప్రారంభంలో అమెరికాడాలర్‌ పటిష్టంఅయింది. భారత్‌ రూపాయి స్వల్పంగా క్షీణించింది. దీనివల్ల ఐటి, ఫార్మా కంపె నీలకు కలిసొస్తుందని నిపుణుల అంచనా. ప్రారం భంలో ఏడుపైసలు పటిష్టమై 64.78కి చేరినా ఆ తర్వాత డాలర్‌ పటిష్టం అయి 65 రూపాయలను దాటింది. ముగింపునాటికి 22పైసలకుపైగా క్షీణిం చిందని అంచనా. అమెరికా డాలర్‌ కొనుగోలురేటు 65.65గా ఉంటే అమ్మకం రూ.64.30వద్ద కొన సాగింది. ఇక గ్రేట్‌బ్రిటన్‌ పౌండ్‌ విలువలు కొను గోలు 82.25 రూపాయలయితే అమ్మకం 80.60 గా నిలిచింది.

యూరో ధరలు కూడా 70 రూపా యలు కొనుగోలు, 68.60 అమ్మకంధరలుగా కొన సాగితే స్విస్‌ ఫ్రాంక్‌ 65.85రూపాయలు, 62.90 గా నడిచాయి. ఇక ఆస్ట్రేలియన్‌ డాలర్‌ 50.70గా కొనుగోలు జరిగితే అమ్మకం కేవలం 48.60గా సాగింది. కెనడియన్‌ డాలర్‌ 49.50 కొనుగోళ్లు, 47.95 అమ్మకాలు ధరలుగా కొనసాగాయి. సింగ పూర్‌ డాలర్‌ 48.10రూపాయలు, 45.10 రూపా యలు కొనుగోలు అమ్మకాల్లో ధరలు పలికాయి. ఇక చైనా యువాన్‌ 0.05 రూపాయలు కొనుగోలు, 8.50రూపాయలుగా నడిచింది. హాంకాంగ్‌ డాలర్‌కు సైతం 8.55రూపాయలు, 7.90 రూపాయలు అమ్మకంధరలుగా కొనసాగాయి.

జపాన్‌ వందయెన్లు 6.80తో సమానంగా కొనుగో లు జరిగితే అమ్మకం 56.50గానే నడిచింది. మలేసియా రింగిట్‌ 15.30, 14.20రూపాయలు, న్యూజిలాండ్‌ డాలర్‌4.05, 43.10 రూపాయలు, థా§్‌ు భాత్‌లు వందవరకూ 199.70రూపాయలు, 183.55 రూపాయలు బెహ్రెయిన్‌ దినార్‌లు 183.40, 160.95రూపాయలు కొనుగోళ్లు అమ్మ కాలుగా కొనసాగాయి. ఇక జోర్డాన్‌ దీనార్‌ 95.3 రూపాయలు, 81.35రూపాయలు, కువైట్‌ దీనార్‌ లు 219.45రూపాయలు, 176.90 రూపాయ లుగా కొనసాగాయి. ఇక ఖతార్‌ రియాల్‌ 19.30 రూపాయలు,16.60రూపాయలు కొనుగోళ్లు, అమ్మ కాలు జరిగాయి. సౌదీ అరేబియా రియాల్‌ 18.95 రూపాయలు, 16.10 రూపాయలు, దక్షిణాఫ్రికా రాండ్‌ రూ.5.15లు,రూ.4.25లుగా కొనసాగాయి.