నెలరోజుల్లో కరెన్సీ సంక్షోభం మటుమాయం!

Arundati Bhattacharya sbi
Arundati Bhattacharya sbi

నెలరోజుల్లో కరెన్సీ సంక్షోభం మటుమాయం!

చెన్నై, పెద్దనోట్ల రద్దు తర్వాత నెలకొన్న నోట్ల సంక్షోభం వచ్చేనెలాఖరునాటికి సద్దుమణుగుతుందని భారతీయస్టేట్‌బ్యాంకు ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నామని పరిస్థితి వచ్చేనెలకు పూర్తిగా సద్దుమణుగుతుందని వెల్లడించారు. ప్రతి వ్యక్తి సగటున విత్‌డ్రాచేసే మొత్తం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సగటు విత్‌డ్రా రోజుకు ఒకవ్యక్తి మూడువేలకు మించి చేయడంలేదని వెల్లడయింది. అయితే పెద్దనోట్ల రద్దుకాలంలో ప్రజల్లో అనేక అపోహలు నెలకొన్నాయని తగినంతగా నగదు తీసుకెళ్లలేమని భయపడ్డారని ఆమె వివ రించారు. ఇపుడుపరిస్థితి భిన్నంగా మారి పెద్దపెద్ద మొత్తాల్లో సొమ్ముడ్రాచేసుకుంటున్నారన్నారు. ఇప్పటి వరకూ తాము పరిస్థితిని అధ్యయనంచేసిన తర్వాత జరిపిన అంచనాలను బట్టిచూస్తే ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తిసాధారణ స్థాయికి వస్తుందని వివరించా రు. మొదటి నాలుగు నుంచి ఆరువారాలపాటు బ్యాంకులు ఈ నోట్లమార్పిడితోనే సరిపెట్టుకున్నాయి.

ఇతర లావాదేవీలపై దృష్టిపెట్టలేకపోయాయి. దీనివల్ల రుణపరపతి వంటివి పూర్తిగా తగ్గిపోయాయని దీనివల్ల బ్యాంకింగ్‌ రంగం, పారిశ్రామికరంగంపై తీవ్ర ప్రభావం ఉంటుందని, మరో రెండు, మూడునెలల్లో పరిస్థితి మెరుగుపడగలదన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ పెట్టుబడులతో కూడిన వినియోగరంగ ఆధారిత బడ్జెట్‌గా నిలుస్తుందన్నారు. గడచిన కొన్నేళ్లుగా ప్రభుత్వాన్ని పెట్టుబ డుల ఆధారిత బడ్జెట్‌ రావాలని కోరుతూనే ఉన్నామని ఇటీవలికాలంలో ప్రైవేటు పెట్టుబడులు ఎంతో ముందంజలో ఉన్నాయన్నారు. ఇటీవలి పరిస్థితులతో కొన్ని ప్రైవేటు కంపెనీల ఆస్థి అప్పుల పట్టీలు సమస్యాత్మకంగా మారాయన్నారు. అనిశ్చితికారణంగా ప్రజలుకొనుగోళ్లపై దృష్టిపెట్టడంలేదన్నారు. ఆర్థిక వ్యవస్థపైమరింత విశ్వాసంపెంపొందించేందుకు ప్రభుత్వం వినియోగరంగం వృద్ధిచెందుతున్నదన్న దీమా కల్పించాలని అప్పుడే బడ్జెట్‌ అటు పెట్టుబడులు, ఇటు వినిమయరంగం రెండింటా సమతుల్యత సాధిం చగలదన్నారు. చెన్నై సర్కిల్‌లో ఎస్‌బిఐ ఎక్స్‌క్లూజివ్‌, చెన్నై మెట్రోట్రాన్సిట్‌ కాంబోకార్డు, ఇ-హుండీ సౌకర్యం శ్రీరంగపురం దేవాలయ భక్తులకోసం ప్రవేశపెట్టారు. అలాగే ట్యాబ్‌ కియోస్క్‌లను ప్రారంభించారు.