నిస్సాన్‌ రీనాల్ట్‌ జెవి సిఇఒగా థియరీ బోల్లోర్‌

theory bollor
theory bollor

కార్లోస్‌ భవిష్యత్తుపై కొల్కిక్కిరాని రెండుకంపెనీలు
టోక్యో: నిస్సాన్‌ఛైర్న్‌ కార్లోస్‌ ఘోస్న్‌ను ప్రాసిక్యూషన్‌ అధికారులు విచారించాన్న వార్తలతర్వాత ఆయన్ను తప్పించిన కంపెనీ కొత్త వ్యక్తిని నియమించే కసరత్తులు ముమ్మరంచేసింది. నిస్సాన్‌మోటార్‌ కంపెనీ, రీనాల్ట్‌ ఎస్‌ఎలు తమభవిష్యత్తు ప్రనాళికలను మరింత విస్తరించేందుకు జాయింట్‌ ఉత్పత్తిని మరింతపెంచుకోవాలన్నా కొత్త వ్యక్తి అపారమైన అనుభవం ఉన్న నిపుణులు అవసరం అవుతాయి. బ్రెజిలియన్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్లోస్‌ను మొత్తం ఫైళ్లు అప్పగించాలని కోరింది. నిస్సాన్‌ కంపెనీ కూడా ఆయన్నున అదుపులోనికి తీసుకున్న తర్వాత ఛైర్మన్‌గా డిస్మస్‌ చేయాలని సూచించింది. గురువారం నిస్సాన్‌ బోర్డు సమావేశం అయి కార్లోస్‌ భవిష్యత్తుపై చర్చించనున్నది. ప్రస్తుతం రీనాల్ట్‌కు తాత్కాలిక అధిపతిగా థియరీ బోల్లోర్‌ నియమితులయ్యారు. అయితే కార్లోస్‌ మాత్రం సిఇఒ హిరోతో సాయికావా తిరుగుబాటుచర్యలకు తాను బలి అయినట్లు వెల్లడించారు. హిరోతోతోపాటు మరికొందరు నిస్సాన్‌లో ఉన్న వారు రెండు కంపెనీల మధ్య పటిష్టమైన పునరేకీకరణను వ్యతిరేకించారు. రీనాల్ట్‌బోర్డు గురువార ంసమావేశం అయి కార్లోస్‌ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వాస్తవానికి రీనాల్ట్‌బోర్డు ఇప్పటివరకూ కార్లోస్‌పై వచ్చిన ఆరోపణలపై స్పందించలేదు. ఈతరుణంలో బోర్డు ఎలాంటి ఆధారాలు లేకుండా కార్లోస్‌పై వ్యాఖ్యలు చేయలేదని, నిస్సాన్‌ జపాన్‌ న్యాయ అధికారులు చేసిన విచారణ వివరాలు అవసరం అవుతాయని వెల్లడించింది. జపాన్‌ న్యాయవ్యవ్థ కట్టుదిట్టంగా ఉంటున్నందున ఆయనకు బహుశా బెయిల్‌ రాకపోవచ్చని అంటున్నారు. ప్రాసిక్యూటర్లు నిర్ణయించేంతవరకూ బెయిల్‌ ఉండదని చెపుతున్నారు. ఒక వెలుగు వెలిగిన ఎగ్జిక్యూట్‌ కార్లోస్‌ నిస్సాన్‌, రీనాల్ట్‌ రెండింటి కూటమికి ఎంతో కృషిచేసారు. ఫ్రెంచ్‌ జపాన్‌ కంపెనీలతోపాటు చిన్నస్థాయిలో మిత్సుబిషి మోటార్స్‌ కార్ప్‌ను కూడా ఒకటిచేసారు. నిస్సాన్‌, రీనాల్ట్‌లకోసం ఆయన ఒకవిధంగా ఛాంపియన్‌గానే పనిచేసారు. రెండుదశాలబ్దాల సంబంధాలను విలీనంతో మరింత కట్టుదిట్టబంచేసారు. ఈ రెండింటి విలీనం వోక్స్‌వ్యాగన్‌, టయోటా మోటార్‌లకు సైతం గట్టిపోటీ ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహంలేదు. అయితేనిస్సాన్‌ సిఇఒ సాయికవా కార్లోస్‌పట్ల విముఖంగా ఉన్నారు. మా కంపెనీ ఎట్టిపరిస్థితుల్లోను ఇలాంటి చర్యలను సమర్ధించదని చెప్పారు. కార్లోస్‌కు మరిన్ని అధికారాలివ్డం ఎట్టిపరిస్థితుల్లోను మంచిది కాదన్నారు. నిస్సాన్‌పై సాయికవా ఒత్తిడి పరపతి కార్లోస్‌ లేనపుడే పెరుగుతుందని భావించారు. రీనాల్ట్‌ ఛీప్‌ ఆపరేటింగ్‌ అధికారి థియరీ బోల్లోర్‌ను తాత్కాలిక సిఇఒగా ప్రకటించారు. కార్లోస్‌కు ఉన్న అధికారాలే ఆయనకు ఉంటాయని ప్రకటించారు. రీనాల్ట్‌ ఉద్యోగులకు వచ్చిన లేఖల్లో కార్లోస్‌నుంచి పూర్తి సహకారం అవసరం అవుతుందని, నిస్సాన్‌ భాగస్వామ్యం కొనసాగాలంటే కార్లోస్‌ సహకారం కీలకమని అభ్యర్ధించినట్లు సమాచారం. ఫ్రెంచ్‌ప్రభుత్వం రీనాల్ట్‌లో అతిపెద్ద వాటాదారుగా ఉంది. కార్లోస్‌పై తన నిర్ణయాన్ని రిజర్వులో ఉంచింది. ఆర్ధిక మంత్రి బ్రూనో లే మైరీ ఫ్రాన్స్‌ ఇన్ఫోరేడియోతో మాట్లాడుతూ ఆయన్ను తొలగించాలని తాము డిమాండ్‌చేయడంలేదన్నారు. మాకు ఎలాంటి ఆధారాలు లేవని, ఫ్రాన్స్‌ స్థానికంగా ఉన్న పన్ను రికార్డులను పరిశీలించామని, ఎలాంటి అవకతవకలు లేవని లీయెయిరీ వెల్లడించారు. ఫ్రాపన్స్‌ లీమెయిరీ, జపాన్‌ హిరోషిగే సేకోలు కూటమి కొనసాగించేందుకే సుముకంగా ఉన్నారు. ఈ రెండుకంపెనీలమధ్య ఉన్న భాగస్వామ్యం జపాన్‌లో ఇటీవలికాలంలో వివాదాలకు తావిస్తోంది. నిస్సాన్‌ రీనాల్ట్‌ను విక్రయాల్లోను, లాభాల్లోను పక్కకు నెట్టేసింది. రీనాల్ట్స్‌ 43శాతం ఓటింగ్‌ సత్తా ఉన్న వాటాలను నిస్సాన్‌లో కలిగి ఉంది. నిస్సాన్‌ కూడా రీనాల్ట్‌లో 15:శాతం వాటాతో ఉంది. అయితే ఎలాంటి ఓటింగ్‌ హక్కులుండవు. మొత్తం మీద ఫ్రాన్స్‌ సంస్థ కార్లోస్‌ను తొలగించేందుకు సుతరాము సుముఖంగా లేదని తెలుస్తోంది.