నాలుగు కంపెనీలకు రూ.61,930.86కోట్లు

CA'S
CA’S

నాలుగు కంపెనీలకు రూ.61,930.86కోట్లు

న్యూఢిల్లీ, జూలై జూలై 25: సెన్సెక్స్‌లో నమోదయిన టాప్‌ పది కంపెనీల్లో నాలుగుకంపెనీల మార్కెట్‌ విలువలు 61,930.86 కోట్లు దిగజారాయి. గత వారం మార్కెట్లలో నెలకొన్న ధోరణుల ఆధారంగా ప్రధానంగా ఐటిసి ఒక్కటే 58,902.54కోట్లు పతనం అయింది. ఐటిసి, హెచ్‌డిఎఫ్‌షి, భారతీయ స్టేట్‌బ్యాంకు, మారుతిసుజుకి ఇండియా మార్కెట్‌ విలువల్లో నష్టాలుచవిచూసాయి. ఇక శుక్రవారంతో ముగిసిన వారంలో రిలయన్స్‌, టిసిఎస్‌, హెచ్‌డిఎఫ్‌సిబ్యాంకు, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, ఇన్ఫోసిస్‌, ఒఎన్‌జిసి వంటివి 54,899.59 కోట్లు మార్కెట్‌ విలువలు పెంచుకోగలిగాయి. నాలుగుసంస్థలు నష్టాలు చవిచూసి న మొత్తంకంటే మిగిలిన కంపెనీలు సాధించిన లాభాలు తక్కువగా ఉన్నాయి.

ఐటిసి అన్నింటికంటే అధ్వాన్నం గా దెబ్బతిన్నది. మార్కెట్‌ విలువలు 3,50,868.47 కోట్లకు దిగజారాయి. గతవారంలో ఐటిసి షేర్లు 14 శాతం దిగజారాయి. మంగళవారం ఒక్కరోజే షేర్లు 13 శాతం దిగజారాయి. సిగరెట్లపై సెస్‌ విధింపు ఒక్కటే కారణమనితేలింది.ఎస్‌బిఐమార్కెట్‌విలువలు 1079.01 కోట్లు పతనం అయ్యాయి. 2,50,631.58 కోట్లకు చేరాయి.

హెచ్‌డిఎఫ్‌సి 1,067.24కోట్లు క్షీణించి 2,61,489.41కోట్లకు చేరింది. మారుతి మార్కెట్‌ విలువలు 882.07 కోట్లు క్షీణించి 2,27,393.79 కోట్లకు చేరాయి. లాభాలపరంగాచూస్తే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మొత్తం మార్కెట్‌ విలువలు 17,933.32కోట్లుపెరిగి 5,15,790.39 కోట్లకు పెరిగాయి. టిసిఎస్‌ 17,630.59 కోట్లుపెరిగి 4,76,829.10 కోట్లకుచేరితే ఒఎన్‌జిసి 7699.94 కోట్లుపెరిగి 2,11,170.88 కోట్లకు చేరింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు మార్కెట్‌ విలువలు 5752.62 కోట్లుపెరిగి 4,38,422.41కోట్లకు చేరింది. హిందూస్థాన్‌ యూనిలీవర్‌ 4,080.02కోట్లుపెరిగి 2,590,764.04 కోట్లకు చేరింది. ఇన్ఫోసిస్‌ విలువలపరంగా 1803.01కోట్లు పెరిగి 2,25,077.61 కోట్లకు చేరింది. టాప్‌ పదిసంస్థలపరంగా రిలయన్స్‌ అగ్రస్థానంలో నిలిచింది. తదనంతరం టిసిఎస్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐటిసి, హెచ్‌డిఎఫ్‌షి, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, ఎస్‌బిఐ, మారుతి, ఇన్ఫోసిస్‌, ఒఎన్‌జిసిలు నిలిచాయి. గడచిన వారంలోనే సెన్సెక్స్‌ 8.14 పాయింట్లుపెరిగితే నిఫ్టీ 28.90 పాయింట్లు పెరిగింది. ====