నాలుగు ఐపిఒలు రూ.రెండువేల కోట్లు

BSE
BSE

నాలుగు ఐపిఒలు రూ.రెండువేల కోట్లు

ముంబయి,, ఆగస్టు 29: స్టాక్‌ మార్కెట్లలో కనీసం నాలుగు కంపెనీలు రెండు వేల కోట్లు ఐపిఒద్వారానిధులు సమీకరించేందుకు సిద్ధంఅవుతున్నాయి. సెప్టెంబరు లోనే ఐపిఒ జారీచేస్తున్నట్లు అంచనా. కంపెనీలు ప్రాథమికంగా వాటాల విక్ర యాన్ని వచ్చేనెల ప్రారంభిస్తాయి. ఆన్‌లైన్‌ మాట్రిమోని కంపనీ మాట్రిమోని డాట్‌కామ్‌, రోడ్లు అభివృద్ధి సంస్థ భారత్‌ రోడ్‌న ఎట్‌ వర్క్‌, ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ డిక్సన్‌ టెక్నాలజీస్‌ వంటివి ఉన్నాయి. వీటితోపాటే రియల్‌ఎస్టేట్‌ సేవల సంస్థ కెపాసిటిఇన్‌ఫ్రా ప్రాజెక్టులు వంటివి కూడా ఐపిఒకు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 15 కంపెనీలు ఐపిఒలద్వారా రూ.12,589.94 కోట్ల నిధులు సమీకరించాయి.

ప్రైమ్‌డేటాబేస్‌ గణాంకాలను అనుసరించి చూస్తే 2015, 2016 సంవత్సరాల్లో మొత్తం 47 కంపెనీలు రూ.40,107 కోట్లు నిధులు సమీకరించాయి. గురువారమే శ్రేయి ఇన్‌ఫ్రాఫైనాన్స్‌ మాతృసంస్థ బిఆర్‌ఎన్‌ఎల్‌ సెప్టెంబరు ఆరున ఐపిఒ జారీచేస్తుందని, రూ.600 నుంచి 700కోట్లు నిధులు సమీకరిస్తామని వెల్లడిం చింది. బిల్డ్‌ ఓన్‌, ట్రాన్స్‌ఫర్‌ (బిఒటి) పద్ధతిలోరోడ్డు ప్రాజెక్టులను చేపడుతోం ది. వీటిలో ఐదుప్రాజెక్టుల ఇప్పటికే అమలులో ఉండగా మరొకటి నిర్మాణదశ లో ఉంది. ఐపిఒద్వారా వచ్చే నిధులను తమ అనుబంధ సంస్థల అవసరాలకు వినియోగిస్తుంది. మాట్రిమొని డాట్‌కామ్‌ కూడా రూ.500 కోట్ల ఐపిఒ జారీ చేస్తోంది.

వాటాలను రూ.130కోట్లకు మించకుడా అమ్ముతుంది. 3.7 మిలి యన్ల వాటాలున్నాయి. వెంచర్‌ కేపిటల్‌ ఇన్వెస్టర్‌ బెస్సెమర్‌ వెంచర్‌ పార్టనర్స్‌ సంస్థనుంచి పూర్తిగా వైదొలగడం, వెంచర్‌ కేపిటల్‌సంస్థ మైఫీల్డ్‌ ఫండ్‌ కూడా తన వాటాను విక్రయించేందుకు నిర్ణయించడంతో ఐపిఒకు వస్తోంది. ఈ నిధులను వ్యాపారప్రకటనలు, ప్రచారం బిజినెస్‌ వృద్ధి, కొత్త కార్యాలయ నిర్మాణం ఓవర్‌డ్రాప్టు చెల్లించేందుకు వినియోగిస్తామని వెల్ల డించింది. మోతీలాల్‌ ఓస్వాల్‌ప్రైవేటు ఈక్విటీడ్వయి జర్స్‌ ఆధ్వర్యంలోన డిక్సన్‌ టెక్నాలజీస్‌ రూ.600 -650 కోట్ల ఐపిఒను జారీచేస్తోంది. ఈ మొత్తంలో కంపెనీ రుణ భారం తగ్గించేందుకు వినియోగిస్తుంది.

ఆ తర్వాత లెడ్‌ టివిల ఉత్పత్తియూనిట్‌ ఏర్పాటుకు నిధులు ఖర్చు చేస్తుంది. మోతీలాల్‌ ఓస్వాల్‌ కూడా తనవాటాలో కొంత మొత్తం ఐపిఒలో విక్రయిస్తుంది. ముంబే కేంద్రంగా ఉన్ననిర్మాణ కంపెనీ కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్సు రూ.400 కోట్ల ఐపిఒ జారీచేస్తోంది. సెప్టెంబరు మొదటిపక్షంలోనే జారీచేస్తోంది. కంపె నీ ఈ ఐపిఒ నిధులను మూలధన అవసరాలు, కొత్త మూలధన ఆస్తుల కొను గోళ్లు, సాధారణ కార్పొరేట్‌ ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగిస్తుంది.