నష్టాల్లో మార్కెట్లు

stock
stock


ముంబై: భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మంగళవారం స్టాక్‌ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ 257 పాయింట్లు నష్టపోయి 35956 వద్ద స్థిరపడింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజి సూచి నిఫ్టీ కూడా 51.7 పాయింట్లను కోల్పోయి 10828 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.98గా ఉంది. ఉదయం కూడా మర్కెట్లు నష్టాలనే మూటగట్టుకున్నాయి.