ధర తగ్గిన రెడ్‌మి నోట్‌4

red me note 4
red me note 4

షావోమికి చెందిన హాట్‌కేకులా అమ్ముడుపోతున్న రెడ్‌మి నోట్‌4 ధర శాశ్వతంగా తగ్గింది. భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను వెయ్యి రూపాయల మేర తగ్గిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. దీంతో రెడ్‌ నోట్‌4 ధరభారత్‌లో రూ.9999నుంచి ప్రారంభమవుతోది. ఈ విషయాన్ని షావోమి ఇండియా అధినేత మను కుమార్‌ జైన్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌లో నంబర్‌1 అమ్మకపు స్మార్ట్‌ఫోన్‌గా ఉన్న రెడ్‌మి నోట్‌ 4ధరను శాశ్వతంగా తగ్గిస్తున్నట్టు మేము ప్రకటిస్తున్నాం అని జైన్‌ ట్వీట్‌ చేశారు. రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ధర తగ్గింపు అనంతరం 3జిబి ర్యామ్‌, 32 జిబి స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 9,999 రూపాయలు కాగా, 4జిబి ర్యామ్‌, 64జిబి ఆన్‌బోర్డు స్టోరేజ్‌ ధర 11,999రూపాయలు. ఎంఐ.కామ్‌, ప్లిప్‌కార్ట్‌ రెండింట్లోనూ ఈ ధర తగ్గింపు ఉండనుంది. ఈ ధర తగ్గింపుతో మోటో జి5, నోకియా 5, శాంసంగ్‌ గెలాక్సి జె7 మోడల్స్‌కు ఇది గట్టిపోటీగా నిలువనుంది. ఈ ధర తగ్గింపుకు అదనంగా, పాత మోడల్స్‌ను ఎక్ఛేంజ్‌ చేసి దీన్ని కొనుగోలు చేస్తే రూ.11,000 తగ్గింపు లభించనుంది. యాక్సిస్‌బ్యాంకు బుజ్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారాకొనుగోలు చేస్తే అదనంగా 5శాతం డిస్కౌంట్‌ను ప్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది. నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లను ఇది అందుబాటులోకి తీసుకొచ్చింది.