దేశంలో ఉప్పుకొరత లేనేలేదు

b9
Salt

దేశంలో ఉప్పుకొరత లేనేలేదు

అహ్మదాబాద్‌, నవంబరు 12: దేశంలో ఉప్పుకు ఎటువంటి కొరత లేదని సరిపడా ఉప్పు ఉత్పత్తి చేశామని, నిల్వలు కూడా పంపిణీకి వెళుతున్నట్లు భారతీయ ఉప్పు ఉత్పత్తిదారుల సంఘం ప్రకటిం చింది. దేశంలో కీలక మార్కెట్లలో కిలో ఉప్పు రూ.200 నుంచి రూ.700వరకూ విక్రయిస్తున్నారని, బ్లాక్‌ మార్కెట్‌ భారీగా పెరి గిందని చెపుతుండటంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా శనివారం మధ్యాహ్నం వరకూ కిలోఉప్పు రూ.100 నుంచి రూ.200 వరకూ పెరిగింది. సాధారణంగా కిలో కళ్లు ఉప్పు పదిరూపాయల నుంచి మహా అయి తే 25రూపాయలకు మించిధరలు ఉండవు. అటువం టిది ఒకేసారి రూ.100, రూ.200 ధరలు వింటుండ టం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత్‌లో ఏటా 27.6 మిలియన్‌ టన్నుల ఉప్పు ఉత్పత్తి జరుగుతోంది. వీటి లో 11.4 మిలియన్‌టన్నులు పారిశ్రామిక అవసరాల కు వెళుతుండగా ఆరు మిలియన్‌టన్నులు వంటింటి అవసరాలకు వినియోగిస్తున్నారు. 6.6 మిలియన్‌ టన్నులు గుజరాత్‌ నుంచి ఇతర దేశాలకు ఎగుమ తులు జరుగుతున్నాయి. దేశంలోగుజరాత్‌లోనే అత్య ధికంగా ఉప్పును తయారుచేస్తారు.

సాలీనా 22.7 మిలియన ్‌టన్నులు ఉప్పును ఉత్పత్తిచేస్తుంటే రాజ స్థాన్‌ 2.4 మిలియన్‌ టన్నులు, తమిళనాడు సుమారు రెండు మిలియన్‌టన్నులు ఉత్పత్తిచేస్తోంది. గుజరాత్‌, ఢిల్లీ, దేశరాజధాని పరిసరాలు, ఉత్తరప్రదేశ్‌లలో ఉప్పు ధరలు అమాంతం పెరిగా యని, కిలో 400 రూపాయలు చొప్పున రిటైల్‌మార్కెట్లలో విక్ర యాలు జరుగుతున్నట్లు వచ్చిన వార్తలు ఒక్కసారిగా బ్లాక్‌మార్కెట్‌ ను పెంచాయి. రిటైల్‌లో వాస్తవానికి కిలో 15కు మించి ఉండదని అంచనా. కేంద్రప్రభుత్వం కూడా ఉప్పు పంపిణీ పరంగా ఎటువంటి కొరతలేదని రాష్ట్రప్రభుత్వాలు కూడా అందుబాటులోనికి తెస్తున్నాయని ప్రకటించిం ది. ఇదంతా ఎవరో కొందరు కుట్రపూరితంటాను, స్వార్ధ ప్రయోజనాలను ఆశించి ధరలు పెంచేందుకుచేస్తున్న ప్రయ త్నాలేనని కేంద్రం అధికారులు వెల్లడించారు. వచ్చే నాలుగు నెలల వరకూ ఉప్పుకుకొరతేలేదని, కొత్త ఉప్పుసీజన్‌ కూడా ప్రారంభం అయిందని అధికారులు చెపుతున్నారు.

ఇతర రాష్ట్రాల్లో ఉప్పుధర ల తీరుతెన్నులపై కూడా కేంద్రం ఆరాతీస్తోంది. గుజరాత్‌ పౌరసర ఫరాల మంత్రి జేష్‌ రాదాదియా మాట్లాడుతూ దేశంలోనే గుజ రాత్‌ అత్యధికంగా ఉప్పు పండిస్తున్న రాష్ట్రమని అందువల్ల ఎటు వంటి కొరతకు అవకాశమేలేదని పౌరులుభయాందోళనలకు గురికా వద్దని భరోసా ఇచ్చారు. వినియోగాని కంటే దేశవవ్యాప్తంగా ఉప్పు నిల్వలు భారీగా ఉన్నాయని వంట ఉప్పుకు సంబంధించి భారత్‌ ఎన్నటికీ కొరతను ఎదుర్కొనే అవకాశమే లేదని భారతీయుప్పు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు భరత్‌రావల్‌ వెల్లడించారు.