త‌గ్గుముఖం దిశ‌గా జీఎస్టీ వ‌సూళ్లు

GST1
GST

ఢిల్లీ: వరుసగా రెండో నెల జీఎస్‌టీ వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరిలో రూ. 85,174 కోట్లు వసూలైనట్లు ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెలలో కేవలం 69శాతం మంది మాత్రమే రిటర్నులు దాఖలు చేసినట్లు తెలిపింది. ఫిబ్రవరి నెలకు గానూ 59.51లక్షల మంది జీఎస్‌టీఆర్‌ 3బీ రిటర్నులను దాఖలు చేసినట్లు పేర్కొంది. గతేడాది డిసెంబరులో జీఎస్‌టీ వసూళ్లు బాగా పెరిగాయి. అయతే ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో కాస్త తగ్గాయి. జనవరిలో రూ. 86,318కోట్లుగా ఉన్నాయి. అయితే ఫిబ్రవరిలో మరింత తగ్గి రూ. 85,174 కోట్లకు పరిమితమయ్యాయి. వీటిలో రూ. 14,945కోట్లు కేంద్ర జీఎస్‌టీ కింద వసూలు కాగా.. రూ. 20,456కోట్లు రాష్ట్ర జీఎస్‌టీ కింద వసూలయ్యాయి. ఐజీఎస్‌టీ కింద రూ. 42,456కోట్లు, పరిహార సెస్సు కింద రూ. 7,317కోట్లు వచ్చాయని ఆర్థికశాఖ పేర్కొంది.  ఐజీఎస్‌టీ నుంచి సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ ఖాతాలకు రూ. 25,564కోట్లు బదిలీ అయినట్లు తెలిపింది. మార్చి 25 వరకు జీఎస్‌టీ కింద నమోదైన వారి సంఖ్య 1.5కోట్లు అని ఆర్థికశాఖ వెల్లడించింది. ఇందులో కాంపొజిషన్‌ విధానాన్ని ఎంచుకున్న వారు 18.17లక్షల మంది. వీరు మూడు నెలలకోసారి రిటర్నులు దాఖలు చేస్తే సరిపోతుంది.