త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌

GOLD1
GOLD

బులియన్‌ మార్కెట్‌లో నేటి బంగారం ధరలు రూ.32,000 మార్కు దిగువకు చేరాయి. రూ.390 తగ్గిన 10 గ్రాముల పసిడి ధర రూ.31,800కు చేరింది. అంతర్జాతీయంగా బలహీన పరిస్థితులు, స్థానిక బంగారం దుకాణదారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో ధరలు తగ్గాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు భారీగా తగ్గి 42,000 మార్కు దిగువకు చేరాయి. కిలో వెండి ధర 1050 తగ్గి రూ.41,350గా నమోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో వెండి ధరలు తగ్గాయి. ఇక న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 1.77 శాతం తగ్గి 1278.90 డాలర్లుగా నమోదైంది.