తెలంగాణలో తొలి వేస్ట్‌2 ఎనర్జీ ప్లాంట్‌

ANDIGO-
ANDIGO-

తెలంగాణలో తొలి వేస్ట్‌2 ఎనర్జీ ప్లాంట్‌

హైదరాబాద్‌, మార్చి 31: జలనవరులు, పర్యావరణ నిర్వ హణలో అగ్రగామిగా ఉన్న ఆయాన్‌ ఎక్ఛేంజి ఇండియా మొదటిసారిగా ఆండికోస్‌ వేస్ట్‌టు ఎనర్జీ వ్యవస్థను తెలంగాణ లో ప్రారంభించింది. బెల్జియం కేంద్రంగా ఉన్న ఆండి కోస్‌ వీటో, యూరోపెమ్‌ భాగస్వామ్యంఉన్న ఆయాన్‌ ఎక్ఛేంజితో చేపట్టిన మొట్టమొదటి వేస్ట్‌టు ఎనర్జీ వ్యవస్థ అని కంపెనీ వెల్లడించింది. ఆండికోస్‌ డిజైన్‌లో అత్యా ధునిక సాంకేతికత ఇండికాన్‌ ఐపిసి ఎంబిఆర్‌, ఇండి యన్‌ అడ్వాన్స్డ్‌డ్‌ బయోమెథనేషనల్‌ విధానాలు ఇమిడి ఉంటాయని కంపెనీ వెల్లడించింది.

మొదట ఇఐపిసి ఎంబిఆర్‌ విధానంలో ఉత్పత్తి అయిన బురదను ఇళ్లలో ఉత్పత్తి అయిన కమ్యూనిటీల్లో ఉత్పత్తి అయిన ఆర్గానిక్‌ కిచెన్‌ వ్యర్ధాలతో సైతం పునరుత్పాదక శక్తి ఇందనం, ఆర్గానిక్‌ ఎరువు, ద్రవ ఘనవ్యర్ధాలనుంచి ఉత్పత్తిచేస్తున్నట్లు వెల్లడించింది. మురుగునీటిని శుభ్రపరచడంతోపాటు స్వఛ్చ ´మైన నీటిని విడుదలచేస్తుందని ఆండికోస్‌వ్యవస్థ వీటి ఉత్పత్తి లో నైపుణ్యం ఉన్నదని ఆయాన్‌ ఎక్ఛేంజి వెల్లడించింది. ఆండికోస్వఏస్ట్‌టు ఎనర్జీ ప్లాంట్‌కు ప్రతిరరోజూ వెయ్యికిలోల ఆర్గానిక్‌ కిచెన్‌ వ్యర్ధాలు, 2-6 మీటర్‌ క్యూబ్‌మురికి బురద ను శుద్ధిచేసే సామర్ధ్యం ఉందని,వ ఈటివల్ల సుమారు 20 కిలోవాట్‌ విద్యుత్‌తోపాటు 1.35 టన్నుల సేంద్రియ ఎరువు ను ఉత్పత్తిచేయగలుగుతుందని సీఎండి రాజేష్‌శర్మ వెల్లడిం చారు.

50 ఏళ్లుగా ఆయాన్‌ ఎక్ఛేంజి పనితీరు సామర్ధ్యం వల్లనే తెలంగాణకు విస్తరించామన్నారు. చమురుగ్యాస్‌, విద్యుత్‌, ఆటోమొబైల్‌, టెక్స్‌ టైల్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఫార్మా మరెన్నో రంగా ల్లో నమ్మకమైన సేవలందిస్తు న్నట్లు శర్మ వివరిం చారు. ===== మారుతిసుజుకి నుంచి డ్రైవర్లకు సొంతకార్లు! హైదరాబాద్‌, మార్చి 30: డ్రైవర్‌ సాధి కారత ప్రణాళిక కింద మారుతిసుజుకి టాక్సీ వాహనాలను పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్‌ లాంఛనంగా ప్రారంభించారు. మీకారును సొంతం చేసుకోండి అన్న తెలంగాణ పథకం కింద మారుతి సుజుకి ఇండియా ట్రావెల్‌ టాక్సీలను లబ్దిదారులకు అందచేసింది.

మారుతి సుజుకి ఇండియా వాణిజ్యవిభాగం అధిపతి అశీష్‌జైన్‌, రీజినల్‌ మేనేజర్‌ ఆనంద్యదత్తా తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా రు.మారుతి సుజుకి ఉబేర్‌, ఎస్‌బిఐ సంస్థలు ఈ ప్రాజెక్టుకు అను సంధానకర్తలుగా వ్యవ హరించాయి. వాహనాలను సరఫరా చేయడంతో పాటు మారుతిసుజుకి డ్రైవర్లకు రోడ్డుభద్రత, డ్రైవింగ్‌ శిక్షణ కార్యక్రమాలు తమ డ్రైవింగ్‌స్కూళ్ల ద్వారా అందిస్తున్నట్లు ఆశిష్‌జైన్‌ వెల్లడించారు.