తగ్గుతున్న పెట్రో, డీజిల్‌ ధరలు

PETROL, DIESEL
PETROL, DIESEL

న్యూఢిల్లీ: ఇంధన ధరలు మేజర్‌ నగరాల్లో మరోసారి తగ్గాయి. గురువారం ఢిల్లీలోపెట్రోలు లీటరుధర రూ.69.74గా కొనసాగింది. ముంబయిలో రూ.75.36గాను, కోల్‌కత్తాలో 71.84గాను, చెన్నైలో రూ.72.36గాను కొనసాగింది. ఇక డీజిల్‌ధరలనుచూస్తే ఢిల్లీలో రూ.63.76గాను, ముంబయిలో రూ.66.72గాను కొనసాగాయి. ముందురోజుకంటే ఏడుపైసలు తగ్గింది. కోల్‌కత్తాలో డీజిల్‌దరలు రూ.65.51గాను, చెన్నైలో రూ.67.31గాను కొనసాగాయి.ఎనిమిది పైసలు చొప్పున ఈ రెండునగరాల్లో ధరలు తగ్గాయి. బుధవారం పెట్రోలుధరలు రూ.69,79ఢిల్లీధరలు, 75.41 ముంబయిలోను కొనసాగితే డీజిల్‌ధరలు ఢిల్లీలో 63.83గాను, ముంబయిలో 66.79గాను కొనసాగాయి. బెంచ్‌మార్క్‌ దేశీయ స్టాక్‌ మార్కెంట్లు సెన్సెక్స్‌, నిఫ్టీలు గరిష్టగా నడిచాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలధోరణులు, ఆసియా మార్కెట్లు ర్యాలీతీసాయి. వాల్‌స్ట్రీట్‌లోసైతం భారీ మార్పులురావడంతో సెన్సెక్స్‌ ఒక్కసారిగాముందురోజు 392 పాయింట్లుపెరిగింది నిఫ్టీకూడా 10,800స్థాయికి పెరిగింది. సన్‌ఫార్మా, విఇడిఎల్‌ సంస్థలు 15శాతం చొప్పునపెరిగాయి.