తగ్గుతున్న టెలికాం కస్టమర్లు

Telecom
Telecom

తగ్గుతున్న టెలికాం కస్టమర్లు

ూ్యఢిల్లీ, మార్చి 24: భారత్‌ టెలికాం చందాదారుల సంఖ్య ఒకకోటి 17 లక్షలమందికి పడిపోయింది. జనవరినెలలో చిన్న ఆపరేటర్లు తమకస్టమర్లలో ఎక్కువ మందిని నష్టపోయారు. ట్రా§్‌ు శుక్రవారం విడుదలచేసిననివేదికను పరిశీలిస్తే ఈ అంశాలు స్పష్టం అవుతున్నాయి. దేశంలో టెలిఫోన్‌ చందాదారులు ఒక కోటి 119.06 కోట్లమందికి చేరారు. అదే జనవరినెల చివరినాటికి 117.5 కోట్లమందికి చేరినట్లు అంచనా. నెల వారీగా 1.32శాతం తగ్గినట్లు ట్రా§్‌ు అంచనావేసింది. మొబైల్‌ చందా దారులసంఖ్య సైతం 1.15 కోట్ల కు పడిపోయింది. అంతకు ముం దు డిసెంబరులో 1.16 కోట్ల మందిగా ఉంటే మరింతగా 1.33శాతం దిగజారింది. టెలి కాం రంగంలోని మెగా ఆప రేటర్లు 12.6మిలియన్ల కొత్త చందాదారులను జనవరినెలలో చేర్చుకున్నారు.

వీరిలో 8.3 మిలియన్ల మంది రిలయన్స్‌ జియోకే వచ్చారు. ఇక భారతి ఎయిర్‌ టెల్‌పరంగా 1.5 మిలియన్ల మంది ఉన్నారు. వొడాఫోన్‌ .1.28 మిలియన్ల మంది కొత్త చందాదారులు రాగా ఐడియా సెల్యులర్‌కు 1.14 మిలి యన్లు, బిఎస్‌ఎన్‌ఎల్‌కు 3.96 లక్షల మంది కొత్త చందాదారులు వచ్చారు. ఆర్‌కామ్‌పరంగా తన మొబైల్‌ఫోన్‌ సేవలను డిసెంబరు నుంచి నిలిపి వేసింది. జనవరిలోనే 21 మిలియన్ల కస్టమర్లను కోల్పోయింది.

ఎయిర్‌సెల్‌ దివాలకు దరఖాస్తు చేయడంతో 3.4 మిలియన్ల చందాదారులు నష్ట పోయారు. టాటా టెలి సర్వీసెస్‌పరంగా 1.9 మిలి యన్ల చందాదారులు, టెలినార్‌ 1.6 మిలియన్ల చందాదారులు ప్రభుత్వరంగంలోని ఎంటిఎన్‌ఎల్‌ 10,634 మంది చందాదారులను నష్టపోయింది. బ్రాడ్‌బ్యాండ్‌ సెగెమంట్‌లో జనవరిలో కొంత వృద్ధి నమోదయింది.

బ్రాడ్‌ బ్యాండ్‌ చందాదారులు 37.81 కోట్లకు పెరిగారు. అంతకుముం దు డిసెంబరు చివరిలో 36.28 కోట్ల మంది ఉండగా నెలవారీ వృద్ధిరేటు 4.2 శాతంగా ఉంది. మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సెగ్మెంట్‌ 35.98 కోట్ల మంది కస్ట మర్లతో జనవరినెలలో వృద్ధినిసాధించింది. అంతకు ముందు డిసెంబరులో కేవ లం 34.45 కోట్లమంది మాత్రమే ఉన్నారు. ఐదు సేవల కంపెనీలు మొత్తంగా 94.52శాతం మార్కెట్‌ వాటాతో ఉన్నాయి. మొత్తం బ్రాడ్‌బ్యాండ్‌ చందాదారుల్లో రిలయన్స్‌జియో 16.83 కోట్లు, భారతిఎయిర్‌టెల్‌ 7.5కోట్లు, వొడాఫోన్‌ 5.48కోట్లు, ఐడియా సెల్యులర్‌ 3.73కోట్లు, బిఎస్‌ఎన్‌ఎల్‌ 1.18కోట్లు మంది ఉన్నట్లు తేలింది.