డీల్‌కుముందే డియోజియోకు తెలుసు!

MaLya11
MaLya11

డీల్‌కు ముందే డియోజియోకు తెలుసు!

న్యూఢిల్లీ,జూన్‌ 25: కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రుణాలను ఉద్దేశ్యపూర్వకంగా ఎగవేసి పన్నుల ఎగవేత, మనీలాండ రింగ్‌ అభియోగాలు ఎదుర్కొంటున్న పారిశ్రామిక వేత్త విజ§్‌ుమాల్యా తన యునైటెడ్‌ స్పిరిట్స్‌ను బ్రిటన్‌ సంస్థ డియోజియోకు విక్రయించేముందే నిధులు బదలాయిం చారా అన్నది విచారణ జరుగుతోంది. ఈ అంశం కొను గోలుకు ముందే డియోజియోకు తెలుసని అమెరికా వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఒక కథనం ప్రచురించింది. 2012లో డియోజియో ఎగ్జిక్యూటివ్‌లను ముంబై నవాసానికి ఆహ్వానించిన మాల్యా వారికి విలాసవంతమైన విందును ఇచ్చారని యునైటెడ్‌ స్పిరిట్స్‌లో మెజార్టీ వాటాను వారికి ఆఫర్‌చేసి నట్లు కథనం ఉటంకించింది. డియో జియో ఈ ఆఫర్‌పై దీర్ఘకాలం తర్జన భర్జనలు పడింది. రెండువైపులా తిరిగి చర్చలు ప్రారంభం అయ్యా యి. కంపెనీ విలీనమే ఒక సవాల్‌గా నిలిచింది.

ఇక మద్యం ఉత్పత్తుల పరంగా విజ§్‌ుమాల్యా కింగ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకున్న ఎయిర్‌లైన్‌ కంపె నీ నగదుపరంగా సమసయలు ఎదుర్కొనడంతో తన మద్యం బిజినెస్‌ నుంచి ఈ కంపెనీకి అడ్వాన్సులు ఇచ్చారు. కేవలం చేతితోరాసిన చిట్టాపద్దుల్లో వీటిని చూపించారు. వాటినిసైతం డియోజియోకు చూపించి నట్లు వాల్‌స్ట్రీట్‌ కథనం ప్రచురించింది. డియోజియోకు చెప్పినట్లుగా ఈ మొత్తాలను కొన్ని కీలకరాష్ట్రాల్లోని రాజ కీయ నేతలకు ఇచ్చినట్లు తేలింది. ఈ రాష్ట్రాల్లో యునై టెడ్‌ స్పిరిట్స్‌ ఉత్పత్తి యూనిట్లను నిర్వహించింది. తదనంతరం డియోజియో యుఎస్‌ఎల్‌లో 55శాతం వాటాను 3.2బిలియన్‌ డాలర్లకు ఒనుగోలుచేసింది. ఐదేళ్ల తర్వాత మాల్యా బిజినెస్‌ను మొత్తం టేకోవర్‌చేసిం ది. జానీ వాకర్‌ విస్కీ, స్మిర్నాఫ్‌ వోడ్కాతయారీపరంగా నంబర్‌వన్‌గా నిలిచింది.

డియోజియోకు ఈ డీల్‌ నిర్వహించిన ఇవాన్‌ మెనెజెస్‌ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ గా వచ్చారు. తదనంతరం డియోజియో భారతీయ అధికారయంత్రాంగం చట్రంలో అనేక సమస్యలు ఎదు ర్కొంది. న్యాయపరమైన సమస్యలు కూడా ఎదుర య్యాయి. ఈడీల్‌ను మాల్యా మనీలాండరింగ్‌ కోసం వినియోగించారా అన్నది కూడాదర్యాప్తుసంస్థలు విచారణ చేశాయి. అయితే ఇపుడు బ్యాంకర్లు డియో జియో కొను గోలుచేసిన షేర్లను కూడా తిరిగి రాబట్టాలని చూస్తున్నా యి. యునైటెడ్‌ స్పిరిట్స్‌ నుంచి 500 మిలియన్‌ డాలర్ల ను మాల్యా బదలాయించారని ఆ మొత్తం తిరిగి చెల్లించలేదని డియోజియో చెపుతోంది. ఆయన ఇతర వ్యాపారాలకు మద్దతుగా ఈ నిధులు బదలాయించారని డియోజియో అంగీకరించింది. కంపెనీ డీల్‌పై సంతకం చేసేముందే ఇవన్నీ తెలుసు కున్నట్లు అమెరికాపత్రిక విశ్లే షించింది.

యుఎస్‌ఎల్‌లో జరిగిన లావాదేవీలన్నీ డీల్‌ పూర్తయిన తర్వాత మాత్రమే స్పష్టం అయిందని ఆధారాలు అప్పుడే లభించాయని డియోజియో అధికారప్రతినిధి వివరించారు. లండన్‌కు చెందిన డియోజియో గతఏడాదే మాల్యాతో సంబంధాలు తెంచేసుకుంది. మాల్యా తనరుణబకాయిలు ఎగవేసార న్న అభియోగాలపై మనీలాండరింగ్‌, పన్నుల ఎగవేత కేసులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు తమకు 1.6 బిలియన్‌ డాలర్లు బకాయిలు రావాలని వీటినిరప్పించేం దుకు మాల్యాను అవసరమైతే జైలుకు పంపిస్తామని చెపుతున్నాయి. గడచినఏప్రిల్‌నెలలో మాల్యా లండన్‌లో అరెస్టు అయి 6.50 లక్షల పౌండ్ల బెయిల్‌పూచీకత్తుపై విడుదలయ్యారు. నేరస్తుల అప్పగింత కార్యక్రమం కింద మాల్యాను అరెస్టుచేసారు.అయితే మాల్యా ఇప్పటికీ తానెలంటి అక్రమాలు చేయలేదని ప్రకటించడం విశేషం.