డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ నికరలాభం రూ.260 కోట్లు

dhlf
dhlf

డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ నికరలాభం రూ.260 కోట్లు

ముంబయి,జూలై 22: ప్రైవేటుహౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ తొలిత్రైమాసికంలో నికరలాభాలు 29శాతం వృద్ధిని సాధించి 260 కోట్లకు పెరిగాయి. నిర్వహణ లాభం కూడా 26శాతం పెరిగి 381 కోట్లుగా ఉందని కంపెనీ వెల్లడించింది. వివిధ కార్యకలాపాల ద్వారా 23శాతం రాబడులు పెరిగి 2408 కోట్లకు పెరిగాయి. మొత్తం రుణపరపతి 20శాతం పెరిగి 76,225 కోట్లకు ఉన్నాయి.

మొత్తంగా నిర్వ హణాస్తులు 23శాతం పెరిగి 88,236 కోట్లకు చేరి నట్లు డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ వెల్లడించింది. స్థూల నిరర్ధక ఆస్తులు 0.97శాతంగా ఉన్నాయి. నికర వడ్డీ మార్జిన్‌ 3.05శాతంగా ఉన్నాయి. కంపెనీసిఎండి కపిల్‌ వాద్వాన్‌ మాట్లాడుతూ గత ఏడాది ఇదే కాలంలో 72,012 కోట్లు ఉన్న నిర్వహణ ఆస్తులు ఈ ఏడాది తొలిత్రైమాసికంలో 88,236 కోట్క్లకు పెరిగాయన్నారు. కంపెనీ ఆర్థికపరిపుష్టికి ఇదేనిదర్శనంగా ఆయన వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్స రంలో కూడా తమ లక్ష్యాలను సాధించగలమని ఆయన అన్నారు. సగటు రుణ టికెట్‌ సైజు 14.3 లక్షలుగా ఉంది. వివిధ గృహరుణాలను, గృహవిస్తరణరుణాలు, గృహాల ఆధునీకరణ రుణాలు, ప్లాట్ల రుణాలు, తనఖారుణాలు, ప్రాజెక్టు రుణాలు, ఎస్‌ఎంఇ రుణాలు, నివాసేతర గృహాలపై రుణాలు, అన్ని కస్టమర్‌ సెగ్మెంట్లకు ఈ రుణాలను వర్తింపచేస్తామని వివరిస్తున్నారు. వివిధర రుణాల పథకాలతోపాటు బీమా రంగం హౌసింగ్ప్‌ఆజెక్టులు, మధ్యతరగతి వర్గాలకు హౌసింగ్‌ప్రాజెక్టులకు రుణపరపతి వంటివి అందిస్తాయన్నారు. డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఫిక్సెడ్‌ డిపాజిట్‌ ఇన్వెస్టర్లకు ఉచిత ప్రమాదబీమా లక్ష రూపా యల వరకూ కల్పిస్తోంది. కంపెనీ ఫిక్సెడ్‌ డిపాజిట్లకు కేర్‌ట్రిపుల్‌ఎ, ఎఫ్‌ట్రిపుల్‌ఎరేటింగ్స్‌ ఉన్నాయి.