డిసెంబరు 5నుంచి పాన్‌కార్డు కొత్త నిబందనలు!

PAN CARD
PAN CARD

న్యూఢిల్లీ: ఆదాయపు పన్నుశాఖ కొత్తగా పాన్‌ కార్డు దరఖాస్తులకు కొత్తతరహా నిబంధనలు షురూచేసింది. .పర్మనెంట్‌ అకౌంట్‌ నంబర్‌ కార్డు దరఖాస్తుదారులకు డిసెంబరు ఐదవ తేదీనుంచి కొత్త నిబంధనలు అమలులోనికి వస్తునఆనయి. 2.5 లోలు లేదా అంతకుమించి ఆర్ధికలావాదేవీలున్నవారు పాన్‌కార్డుకు దరఖాస్తుచేయవచ్చు. కేంద్ర ప్రత్యక్షపన్నులబోర్డు ఇందుకు అనుమతులిస్తుంది. ఒక వ్యక్తి 2.50లక్షలకుమించిన ఆర్ధికలావాదేవీలు ఒక ఆర్ధిక సంవత్సరంలో చేస్తే పాన్‌కార్డు ఉండితీరాలి. 2019 మే 31వ తేదీనాటికి పాన్‌ దరఖాస్తుచేసేవారికి ఈ నిబందనలు అమలవుతాయి. పాన్‌కార్డు దరఖాస్తుల్లోకూడా నిబంధనలు సవరించింది. ఎండి, భాగస్వామి, ట్రస్టీ, ఆధర్‌, వ్యవస్థాపకులు, కర్త, సిఇఒ, ప్రిన్సిపల్‌ అధికారి లేదా పాలకవర్గ సభ్యుడు ఎవరరైనా పాన్‌ కార్డును మే 31వ తేదీలోపు దరఖాస్తుచేసుకోవాలి. నివాసిత సంస్థలు పాన్‌కార్డును మొత్తం విక్రయాలు, టర్నోవర్‌, స్తూల రాబడులు ఐదులక్షలకు మించి ఉండకూడదని నంగియా అడ్వయిజర్స్‌ భాగస్వామి సూరజ్‌ నంగియా వెల్లడించారు. ఆదాయపు పన్నుశాఖపరంగాచూస్తే కొన్ని నిర్ధిష్టమైన మార్పులుచేసింది. ఆదాయపు పన్ను నిబంధనలను పాన్‌ దరఖాస్తుల్లో తప్పనిసరిచేసిన తర్వాత రాబడులు ఎక్కువ ఉన్నవారికి పాన్‌ కార్డు తప్పనిసరి అయింది. అలాగే పాన్‌కార్డులో తండ్రిపేరు తప్పనిసరికాదు. ఒకవేళ దరఖాస్తుదారు తల్లి ఒక్కరుమాత్రమే అయినపక్షంలో నిబంధన తప్పనిసరిలేదని వెల్లడించింది. కొత్త నిబంధనలు అన్నీ డిసెంబరు ఐదవ తేదీనుంచి అమలుకువస్తాయి. దేశంలో ఆదాయపు పన్ను అస్సెస్సీలకు పాన్‌కార్డు తప్పనిసరి అవుతుంది. అలాగే ఇపుడు ఆర్ధిక లావాదేవీలకు సైతం విధిగా వాడాల్సివస్తోంది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలుచేయాలన్నా పాన్‌కార్డు తప్పనిసరి అవుతున్నందున ప్రతి ఒక్కరూ విధిగా పాన్‌కార్డు పొందాల్సి వస్తోంది.