డిసెంబరులో పెరిగిన మారుతి అమ్మకాలు

MARUTI
MARUTI

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ఆటో మొబైల్‌ సంస్థ మారుతిసుజుకీ ఇండియా డిసెంబరు నెలలో రాణించింది. గత నెల లో సంస్థ అమ్మకాల్లో 10.3శాతం వృద్ధి సాధించి 1,30,066 యూనిట్లను విక్రయించింది. 2016 డిసెంబరులో మారుతి అమ్మకాలు 1,17,908యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ దేశీయ అమ్మకాల్లో 12శాతం వృద్ధి నమోదు చేసి 1,19,286యూనిట్లను విక్రయించినట్లు మారుతి సుజుకీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆల్టో, వేగాన్‌ఆర్‌ లాంటి మినీసెగ్మెంట్‌ కార్ల విక్రయాలు 2శాతం పెరిగి 31,146యూనిట్లుగా ఉన్నాయి. ఇక కాంపాక్ట్‌ సెగ్మెంట్‌లోని స్వీఫ్ట్‌, ఎస్టిలో, డిజైర్‌, బాలెనో కార్లు వినియోగదారులను ఎక్కువగా
ఆకట్టుకున్నాయి. గత నెలలో ఇలాంటి కార్లు 53,336 యూనిట్లు విక్రయమయ్యాయి. మధ్య శ్రేణి వాహనమైన మారుతి సియాజ్‌అమ్మకాలు డిసెంబరులో 35.8శాతం పెరిగి 2,382 యూనిట్లు విక్రయ మయ్యాయి. ఎగుమతులు మాత్రం 2016తో పోలిస్తేకాస్త తగ్గాయి. 20-16 డిసెంబరులో 11,494 యూని ట్లను ఎగుమతి చేయగా, 2017 డిసెంబరులో ఆ సంఖ్య 6.2 శాతం తగ్గి 10,780 యూనిట్లుగా ఉంది.