డాలరు మరింత పటిష్టం

b2
Rs. Dollar

డాలరు మరింత పటిష్టం

న్యూఢిల్లీ: ఇటీవల డాలరుతో మారకంలో దూకుడు చూపు తున్న దేశీయ కరెన్సీ ఉన్నట్టుండి నీరసించింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బలహీనపడింది. డాలరుతో మారకంలో రూపాయి 26పైసలు (0.41శాతం) క్షీణించి 65.56వద్ద మొదలైంది. అమెరికా ప్రెసిండెంట్‌ ట్రంప్‌ పేర్కొంటూ వస్తున్న పన్ను సంస్కరణల అమలు ఆలస్యంకానుందన్న అంచనా లు, ఉత్తరకొరియా అణు కార్యక్రమాలకు తెరలేపనుందన్న ఆందో ళనలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలకు తెరలేపా యి. దీంతో అమెరికా సహా ఆసియా వరకూ పెట్టుబడుల ఉపసం హరణ కనిపిస్తోంది. ఈ ప్రభావం దేశీయంగానూ కనిపించే పరిస్థితుల నేపథ్యంలో రూపాయి బలహీన పడినట్టు విశ్లేషకులు పేర్కొన్నారు. మంగళవారం రూపాయి 06పైసలు బలపడి 65.30 వద్ద ముగిసింది.