ట్వీట్‌ స్టామ్‌తో అపరిమిత పదాలు

Twit
Twit

కాలిఫోర్నియా: ట్వీట్టర్‌లో 140 అక్షరాలు సరిపోవడం లేదని, ఇటీవల ఆ సంఖ్యను 280కి మార్చారు. ఐనా కొందరికి అది కూడా సరిపోదు. అలాంటి వాళ్ల కోసం ‘ట్వీట్‌ చేసుకోవచ్చు. ఐతే ఆ సందేశం 280 అక్షరాల చోప్పున విడిపోయి వరుసలో పోస్ట్‌ అవుతుంది. వాటికి  సీరియల్‌ నంబర్‌ కూడా వస్తుంది. ఈ తరహా ఆప్షన్‌ను చాలా రోజుల నుంచి కొన్ని థర్డ్‌పార్టీ సర్వీసులు అందిస్తున్నాయి. ఐతే ఇకపై వాటి అవసరం లేకుండా ట్వీటర్‌ నేరుగా ఈ ఆప్షన్‌ను అందిస్తోంది. ప్రస్తుతం ‘ట్వీట్‌ స్టామ్‌ ఫీచర్‌ మన దేశంలో కొందరికి ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంది. దీని ద్వారా ట్వీట్‌ రాసుకున్నాక పోస్ట్‌ కొడితే కాస్త సమయం తీసుకొని దానంతట అదే వివిధ ట్వీట్లుగా విడిపోయి పోస్ట్‌ అవుతుంది.  ఆ ప్రాసెస్‌ను చూపించే ఓ ఇమేజ్‌ ద్వారా ఈ విషయం బహిర్గతమైంది.