ట్రంప్‌ సంకేతాలపైనే ఇన్వెస్టర్ల ఆసక్తి

sensex
sensex

ట్రంప్‌ సంకేతాలపైనే ఇన్వెస్టర్ల ఆసక్తి

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

 

ముంబై, జనవరి 20: బెంచ్‌మార్క్‌ సూచీలు ఒత్తిడికిలోనయి స్టాక్‌ మార్కె ట్లు ట్రేడింగ్‌ దిగువస్థాయిలోనే ముగించేందుకు కార ణం అయ్యాయి.అమెరికా కొత్త అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతల స్వీకారం, యాక్సిస్‌ బ్యాంకు ఫలి తాలు నిరాశకలిగించడం వంటి అంశాలు మార్కె ట్లకు, ఇన్వెస్టర్లకు కీలకం అయ్యాయి. చైనా నాలుగో త్రైమాసికం ఆర్థికవృద్ధి అంచనాలను మించడం, ఫెడ్‌రిజర్వు ఛైర్మన్‌ వడ్డీరేట్ల పెంపు సంకేతాలు వదలడం వంటివి కూడా మార్కె ట్లలో సెంటిమెంట్‌ను పెంచాయి. నిఫ్టీ 50 సూచీ 8400 స్థాయిననుంచి దిగజా రింది. యాక్సిస్‌బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఆదాని పోర్టులు, ఎసిసి వంటి సంస్థ్తలు మరింత క్షీణిం చాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 296 పాయింట్లవరకూ దిగజారింది. చివరికి ట్రేడింగ్‌ ముగిసేనాటికి 274 పాయింట్లు క్షీణించి 27,034 పాయింట్లవద్ద స్థిరపడింది. నిఫ్టీ 85 పాయింట్లు దిగజారి 8349 పాయింట్లవద్ద స్థిర పడింది. ఇక బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌సూచి 1.5 శాతం, స్మాల్‌క్యాఫ్‌ సూచీలు 1.2శాతం దిగజారా యి. ముందురోజు వరకూ మూడో త్రైమాసిక ఫలి తాలే మార్కెట్లకు కీలకం అయి కొంత సానుకూలం గా మారింది. అయితే ఆర్థికరంగ సంస్థలపరంగా నిరాశకలిగించడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తం అయ్యా రు. అదనంగా కమోడిటీ షేర్లు పునరేకీకరణతో కొంతమేర వెనుకంజవేసాయి.

వీటికితోడు ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవం కూడా కారణం కావడంతో మార్కెట్లకు కొంత ఒత్తిడి తప్పదని జియోజిత్‌ బిఎన్‌పి పరిభాస్‌ ఆర్థికసేవల రీసెర్చి హెడ్‌ వినోద్‌ నాయర్‌ వెల్లడించారు. ఇక వివిధ సెక్టార్లపరంగా భారతి ఎయిర్‌టెల్‌, ఏసియన్‌ పెయింట్స్‌, ఐటిసి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు వంటివి ఎక్కువ లాభాల్లో నడిచాయి. యాక్సిస్‌బ్యాంకు, అదానిపోర్టులు, టాటాస్టీల్‌, ఎస్‌బిఐ, ఐసిఐసిఐబ్యాంకులు సెన్సెక్స్‌ లో వెనుకంజవేసాయి. బ్యాంకింగ్‌ రంగం రెండు శాతం దిగజారింది. ఐటిసిపరంగాచూస్తే 0.6శాతం పెరిగింది. హిందూస్థాన్‌ యూనిలీవర్‌ 0.5శాతం పెరిగింది ఇతరత్రా ఐసిసిఐబ్యాంకు 1.9శాతం క్షీణి స్తే ఇన్ఫోసిస్‌ కూడా 1.3శాతం దిగజారింది. వ్యక్తి గత వాటాల పరంగాచూస్తే మైండ్‌ట్రీ మూడుశాతం ఇంట్రాడేలో క్షీణించింది. 1.9శాతం దిగువన ముగిసింది. నికరలాభాల్లో 26శాతం దిగజా రి 103 కోట్లకు చేరడమే ఇందుకుకీలకం. మదర్‌ సన్‌షుమి 3శాతంపెరిగింది.

పికెసి గ్రూప్‌ను 571 మిలియన్‌ యూరోలకు కొనుగోలుచేసినట్లు ప్రకటిం చడమే ఇందుకుకీలకం. రుచిసోయా ఇండస్ట్రీస్‌ కూడా 14శాతం పెరిగింది. కంపెనీ బాబారామ్‌దేవ్‌ పతంజలి ఆయుర్వేదతో మార్కెటింగ్‌ డీల్‌కు వస్తు న్నట్లు ప్రచారం రావడమే ఇందుకుకీలకం. అదాని పవర్‌ 12శాతం దిగువన ముగిసింది. కంపెనీ 325 కోట్ల నికరనష్టం చవి చూసింది. ఇక అంతర్జాతీయ మార్కె ట్ల పరంగాచూస్తే ఆర్థికరంగపరంగా అమెరికా అధ్యక్షుని బాధ్యతల స్వీక రించిన తర్వాత చేసే ప్రసంగంపైనే దృష్టిపెట్టారు. యూరోపియన్‌ మార్కెట్లు ట్రంప్‌ మొదటిప్రసంగంపై ఆసక్తి చూపించాయి. బ్రిటన్‌ ఎఫ్‌టి ఎస్‌ఇ 0.15శాతం దిగజారితే జర్మనీ డాక్స్‌ ఫ్రాన్స్‌ సిఎసిలు స్వల్పంగా పెరగడం జరిగింది. జపాన్‌ నిక్కీ గతం నష్టాలను అధిగమించి 0.3శాతం పెరిగింది. చైనా నాలుగో త్రైమాసిక జిడిపి వృద్ధి 6.8శాతంగా ప్రకటించిం ది. ప్రభుత్వం ఎక్కువ వ్యయప్రణాళికను ప్రకటిం చడం, రికార్డుస్థాయిలో బ్యాంకు రుణాలు విడుదల కావడం ఇందుకు కీలకం అని చెపుతున్నారు. చైనా సిఎస్‌ఐ 300 సూచి 0.8శాతం పెరిగింది.